"స్వాగ్" మూవీలో శ్రీ విష్ణు పాత్ర పై అదిరిపోయే న్యూస్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఈయన సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా , నీది నాది ఒకే కథ , సమజవరగమన తాజాగా ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు స్వాగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. హ‌ర్షిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే సీనియర్ హీరోయిన్ అయినటువంటి మీరా జాస్మిన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం నిన్న ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు , ఆయన ఈ సినిమాలో ఏకంగా 14 విభిన్న రకాలైన గెటప్ లలో కనిపించబోతున్నట్లు , ప్రతి గెటప్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా మేకర్స్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు హీరోగా నటించిన మూవీ కావడం , ఇందులో ఈయన క్యారెక్టర్ అద్భుతంగా ఉండబోతుంది అని తెలియడం , మీరా జాస్మిన్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: