గుడివాడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లవ్ స్టొరీ సూపర్..?

Pulgam Srinivas
మరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గుడివాడ నుండి కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము బారిలోకి దిగబోతున్నాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాము భార్య అయినటువంటి సుఖద ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా రాముతో తన ప్రేమ గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో సుఖద మాట్లాడుతూ... మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఆర్ వి ఆర్ కాలేజీలో మేమిద్దరం క్లాస్మేట్స్. అలా మేమిద్దరం క్లాస్మేట్స్ అయినప్పటికీ చాలా కాలం మాట్లాడుకోలేదు. ఒక రోజు నేను నాతో ఉన్న ముగ్గురు స్నేహితులు క్లాస్ లో సార్ చెప్పినవి నోట్ చేసుకోలేదు.

దానితో ఎవరైనా నోట్స్ ఇస్తే బాగుంటుంది అని అంతా అటు ఇటు చూసాం. కానీ అక్కడ ఎవరు పెద్దగా స్పందించలేదు. అలాంటి సమయంలోనే రాము వైపు చూశాను. నోట్స్ అని అడిగేలోపే రాము ఏమీ ఆలోచించకుండా అతని చేతిలో ఉన్న నోట్స్ ని నా టేబుల్ పై వేసి వెళ్ళిపోయాడు. అది అంతే అక్కడికే ఆగిపోయింది. ఆ తర్వాత కాలేజీలో మేమిద్దరం ప్రేమలో ఉన్నాము అని రకరకాల గాసిప్స్ మొదలు అయ్యాయి. నేను షాక్ అయ్యాను. నేను అతనితో పెద్దగా మాట్లాడనే లేదు... ఎలా ఇవన్నీ వచ్చాయా అనుకున్నాను.

ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే రామునే ఆ న్యూస్ ను స్ప్రెడ్ చేశాడు అని... కానీ ఆ తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చే సరికి మేమిద్దరం కొంచెం కొంచెం మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. అలా క్లోజ్ అయిన మేము పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అయిన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. వివాహం అయిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. దానితో నేను వారిని చూసుకోవడమే సరిపోయేది.

ఇక రాము జాబ్ చేయడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. కొన్ని వ్యాపారాలు స్టార్ట్ చేశాడు. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అలాంటి సమయంలోనే మేము ఫారన్ కి వెళ్ళాము. అక్కడ కూడా రాము ఉద్యోగం చేయడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. అలాంటి సమయంలో ఆయన ఓ ఆఫీస్ పెట్టాడు. అది బాగా సక్సెస్ అయ్యింది. ఇక అప్పుడు స్టార్ట్ అయిన మా లవ్ ఇప్పటికి కూడా ఎంతో సూపర్ గా ముందుకు సాగుతుంది అని రాము భార్య అయినటువంటి సుఖద చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: