యలమంచిలి (వైసీపీ): ఆ రాజు ముక్కోపి.. గెలుపు కష్టమే..?

Divya
•కన్న బాబు రాజు ప్రవర్తనే కూటమికి కలిసొస్తోందా
•ప్రజలపై ఎదురు దాడి చేస్తున్న కన్నబాబు రాజు
•వైసిపి సీటు కోల్పోవడం ఖాయమేనా

(విశాఖపట్నం జిల్లా (యలమంచిలి) - ఇండియా హెరాల్డ్ )
నాయకుడు అంటే ప్రజలతో మమేకమవుతూ .. ప్రజల కష్టాలను తెలుసుకొని.. వారికి అండగా నిలబడినప్పుడే నాయకుడు అని పిలిపించుకుంటాడు.  కానీ ఆ ప్రజలనే ముప్పుతిప్పలు పెడుతూ అధికారంలోకి రావాలని తపన పడితే మాత్రం అదే ప్రజలు బుద్ధి చెబుతారనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం ఇదే జరుగుతోంది యలమంచిలి నియోజకవర్గంలో.. వైసిపి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న కన్నబాబు రాజు ముక్కోపి.. ఆ కోపమే స్థానికంగా ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యేలా చేస్తోంది.మరి వైసిపి యలమంచిలి టికెట్టును దక్కించుకుంటుందా అన్న విషయం ఇప్పుడు సందేహంగా మారింది.అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం...
మొదట కన్నా బాబు రాజు ప్రొఫైల్ విషయానికి వస్తే... ఈయన అసలు పేరు యూ.వీ. రమణమూర్తి రాజు.. 2004 , 2009 ఎన్నికలలో విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు కూడా స్వల్ప మెజారిటీతోనే గెలిచారు.. కాపుల అడ్డాగా చెప్పుకునే యలమంచిలిలో కేవలం ఐదారు వేల ఓట్ల తేడాతోనే  రెండు సార్లు కన్నబాబురాజు గెలుపొందారు. అలాగే ఈయన కొడుకు సుకుమార్ వర్మ డీసీసీబీ  చైర్మన్ గా కూడా పని చేశారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి కూడా తక్కువ మెజారిటీతోనే గెలవడం ఆశ్చర్యకరం.. ఈ నేపథ్యంలోని ఈసారి గట్టి పోటీ ఏర్పడింది. ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీకి దిగుతున్నారు.
ఇలాంటి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈసారి కన్నబాబురాజు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.. ఎందుకంటే ఆయన బయట ప్రచారంలోకి వస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు.. అంతేకాదు ప్రశ్నించిన వారిపై దాడి చేస్తూ  విమర్శలకు గురి అవుతున్నారు కన్నబాబు రాజు. మరోవైపు అధికారంలో ఉన్న గత నాలుగు సంవత్సరాలుగా నోటి దురుసు కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అసలే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రజలు.. నోటి దురుసు ఎమ్మెల్యేకు ఎక్కడికి అక్కడ తమ ప్రశ్నలతో చుక్కలు చూపిస్తున్నారు. అయినా సరే ఈయన ప్రవర్తన మారలేదని సమాచారం. అంతేకాదు సొంత పార్టీ నేతలు కార్యకర్తలపై నోరేసుకుని పడిపోతున్నారు కన్నబాబు రాజు. మరొకవైపు సొంత పార్టీ శ్రేణులు ఈయనపై మండిపడుతున్నారు. ఇకపోతే గత ఎన్నికలలో టిడిపి ఓట్లు చీలడం వల్లే కన్నబాబుకు కలిసొచ్చిందని అందరూ అంటున్నారు.. అయితే ఈసారి జనసేనలో భాగంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బరిలోకి దిగుతుండడం అక్కడ ఐదారు వేల ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కన్నబాబు ప్రవర్తన దృష్టిలో పెట్టుకొని జనసేన వైపు ప్రజలు ముగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరి ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: