ఏపీ: ముద్రగడ ఛాలెంజ్.. పవన్‌ను ఓడించలేకపోతే గుండు కొట్టుకుంటా?

Suma Kallamadi
సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాలు విమర్శల రాళ్లను ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక సవాల్‌ విసరడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే... పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న విషయం విదితమే. దాంతో పిఠాపురంలో ఎలాగైనా పవన్‌ను ఓడించాలని అధికార పార్టీ వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న నేపథ్యంలో పద్మానాభరెడ్డి ఇపుడు పిఠాపురం నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని, అవసరమైతే గుండు కొట్టుకుంటానని సవాల్‌ చేయడం జరిగింది.
అంతటితో ఆగకుండా పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ను క్లీన్ స్వీప్ చేసి అక్కడినుండి కుక్కను తరిమినట్టు తరిమేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు ముద్రగడ పద్మనాభం. ఇంకా ఆయన మాట్లాడుతూ... "ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అనేది చంద్రబాబు తాత జాగీరు కాదని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు ఇక్కడ చోటు లేదు. ప్రచారంలో భాగంగా పవన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏకంగా బూతులు తిడుతూ దూషిస్తున్నాడు." అని ముద్రగడ ఆగ్రహించారు. అసలు రాజకీయంగానే విషయము మీద అవగాహన లేని పవన్ ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటూ పవన్ మాట్లాడుతున్నాడని ఈ సందర్భంగా ఫైర్‌ అయ్యారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... "తుని రైలు దహనం జరిగినప్పుడు మీ పక్కన ఉన్న నెహ్రు వైసీపీలోనే ఉన్నాడు అని తెలుసుకో. తుని రైలు సంఘటనకి ప్రధానంగా చంద్రబాబే కారణం. ఈ విషయం దయచేసి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. నన్ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేసాడు. ఇక చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చిన ఎటువంటి ప్రయోజనం లేదు." అని కుండ బద్దలు కొట్టి మాట్లాడారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం గురించి చిరంజీవి ఎందుకు బయటకు రాలేదని ఈ నేపథ్యంలో నిలదీశారు. ఇప్పుడు మద్దతుగా వీడియోలు రిలీజ్ ఇస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు? అని ముద్రగడ కామెంట్స్ చేయడం ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: