రాబోయే రోజుల్లో టీడీపీకి దిక్కు అతడే.. నో డౌట్?

Suma Kallamadi
తెలుగుదేశం పార్టీ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ అయినటువంటి తె.దే.పా పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఆయన 1982, మార్చి 29న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది అపుడే. ఇక పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే అంకితమని అలనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతినబూనాడు.
కట్ చేస్తే 1999-2004లో 13వ లోక్‌సభ వేదికగా 29 మంది సభ్యులతో దేశంలోనే 4వ పెద్ద పార్టీగా నిలచి వార్తల్లోకెక్కింది. అప్పట్లో రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, యావత్ దేశాన్నంతటినీ ఆశ్చర్యపరిచారు. సినిమా వాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబే చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించారు. ఆ తరువాతి కాలంలో 1989, 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి, రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు.
అక్కడే వచ్చింది అసలు చిక్కు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి రెవెన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఎన్.టి.రామారావు అప్పట్లో అధికారం కోల్పోవలసి వచ్చింది. అయితే దీనిపైన అనేక రూమర్స్ వున్నాయి అది వేరే విషయం. తదనంతరం బాబు కూడా అకుంఠిత దీక్షతో పార్టీని ముందుకు నడిపించాడు. అయితే ఇపుడు బాబు వృద్ధాప్య దశకు చేరుకోవడంతో టీడీపీ పగ్గాలు నారా వారసుడు లోకేష్ చేతిలో పెట్టాలని యోచిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.
రాజకీయాల్లో వారసత్వం సహజమే. కానీ అది అన్ని కాలాల్లో కుదరకపోవచ్చు. రాజకీయంగా బాబుకి ఉన్న చరిష్మా లోకేష్ కి లేదనేది జనాల మాట. అంతెందుకు టీడీపీ వర్గంలోనే లోకేష్ నాయకత్వంపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కనబడుతున్న ఒకే ఒక్క ఆప్షన్ నందమూరి జూనియర్ తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనడంలో అతిశయోక్తి లేదు. తాత ముఖ వర్చస్సుతో పాటు తరగని ప్రతిభను సైతం సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ రంగంలో దూసుకుపోతున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి తాత నుండి వారసత్వంగా కేవలం సినిమాలే కాదు, రాజకీయ రంగం కూడా ఉంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు. అవును, రాబోయే రోజుల్లో టీడీపీకి దిక్కు అతడే.. నో డౌట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: