చిరంజీవి డెసిషన్ ను వ్యతిరేకిస్తూ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్..??

murali krishna
కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ మన కెరీయర్ని నెగిటివ్గా మార్చేస్తాయి. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే .. కొన్ని కొన్ని సార్లు లైఫ్లో టఫెస్ట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.బహుశా రాబోయే రోజుల్లో చిరంజీవి అలాంటి ఓ టఫ్ సిచువేషన్ ని ఎదుర్కొంటాడు ఏమో అంటున్నారు అభిమానులు . దానికి కారణం రీసెంట్గా ఆయన కమిట్ అయిన డైరెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరాశ సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి .ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా చేయాల్సి ఉంది అంటూ ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట . అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మరో డైరెక్టర్ వచ్చినట్లు తెలుస్తుంది . ఆయన చిరంజీవికి ఫ్లాప్ అందించిన డైరెక్టర్ . ఆయన మరెవరో కాదు మోహన్ రాజా. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడట . ఇది తెలుసుకున్న అభిమానులు మండిపడుతున్నారు .బ్రెయిన్ దొబ్బిందా..? పోయి పోయి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఎలా ఇస్తాడు ..? ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమా బాగాలేదు అంటూ రివ్యూ వచ్చిందిగా.. టాలెంటెడ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి.. లేదా కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వాలి.. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు ..ఇలా చేస్తే మీ సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం సర్వం నాశనం అయిపోతుంది .. ప్లీజ్ ఆలోచించుకోండి అంటూ మెగా ఫాన్స్ సజెస్ట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో చిరంజీవి పేరు మారుమ్రోగిపోతుంది . ఆల్రెడీ ఆచార్య సినిమాతో ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆ ట్రోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వశిష్ట సినిమా హిట్ కాకపోతే చిరంజీవి పేరు పాతాళానికి పడిపోవడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: