ఏపీ: ఆ చిన్న లాజిక్ తో.. చంద్రబాబు గుట్టురట్టు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైయస్ షర్మిల చేపట్టడంతో కచ్చితంగా ఓట్లు చీలుతాయని నమ్మకం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది.. తాజాగా మాజీ లోక్సభ సభ్యుడు చింతామోహన్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మరొకసారి తిరుపతి లోక్సభ స్థానం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు.. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే మర్చిపోయారు ఇలాంటి సమయంలో ఈయన హాస్య చతురతతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దృష్టిలో ఉంచేలా చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన జోక్ వేయడం జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కి నారా చంద్రబాబు నాయుడు భారీ విజయాన్ని సాధించి అధికారంలోకి వస్తారని తెలియజేశారు.. అయితే ఈ విషయాలను జగన్మోహన్ రెడ్డి పైన ద్వేషం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఇదే. మరి చింతామోహన్ చేసిన జోక్ ఎలా అవుతుందని డౌట్ అందరికీ రావచ్చు.. ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టిడిపికి సీట్లు తగ్గుతాయని నరేంద్ర మోడీతో పొత్తు లేకపోయి ఉంటే భారీ విజయంతో చంద్రబాబు గెలిచేవారని తెలియజేశారు.

మోడీతో చెయ్యి కలపడం వల్ల సీట్లు తగ్గొచ్చు కాని ఖచ్చితంగా అధికారం వస్తుందని విషయాన్ని తెలియజేశారు చింతామోహన్.. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయ్యుండి తమ పార్టీ గెలుస్తుంది అని చెప్పకుండా కేవలం చంద్రబాబు గెలుస్తారని చెప్పడం విడ్డూరంగా ఉంది . దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ టిడిపికి సపోర్ట్ చేస్తోందని అంతేకాకుండా వైయస్ పేరుతో షర్మిల ఓట్లు చీల్చే పని చంద్రబాబు నాయుడు షర్మిల కుట్రలో భాగమే అన్నట్లుగా ఇప్పుడు వినిపిస్తోంది.కాంగ్రెస్ నాయకులందరికి కూడా చంద్రబాబు బోల్డంత ఫండింగ్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలతో లోలోపల మంతనాలు జరుపుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి గుట్టు ఏకంగా కాంగ్రెస్ నేత రట్టు చేసినట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: