చంద్రబాబు, బాలయ్యలకు ఎన్టీఆర్ బర్త్ డే గుర్తు లేదా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Reddy P Rajasekhar
ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఏపీలో భారీ స్థాయిలో జరిగాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ నుంచి షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. వార్2 సినిమా నుంచి సైతం ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించినా రిలీజ్ కు ఏడాదికి పైగా సమయం ఉన్న నేపథ్యంలో వార్2 మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
 
అయితే తారక్ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ విషెస్ చెప్పడం లోకేశ్ పోస్ట్ కు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కావడం జరిగింది. అయితే చంద్రబాబు, బాలయ్యలకు ఎన్టీఆర్ బర్త్ డే గుర్తు లేదా అంటూ ఫ్యాన్స్ ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు కావాలి కానీ ఎన్టీఆర్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పే తీరిక లేదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
 
ఈ తీరు వల్ల భవిష్యత్తులో టీడీపీ నేతలు భారీగా నష్టపోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ విషయంలో ఎప్పుడూ ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేయలేదని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎవరు విష్ చేసినా ఎవరు విష్ చేయకపోయినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ కు ఇప్పటివరకు ఏకంగా 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ డేతో పోల్చి చూస్తే సెకండ్ డే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో ఐదేళ్ల తర్వాత తారక్ రాజకీయాలపై ఫోకస్ పెడతారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన ఎంట్రీ సంచలనం అవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: