జగన్‌ గెలుపు పక్కా.. రేవంత్‌ రెడ్డి డిసైడ్‌ అయ్యారా?

విభజన హామీలు, ఏపీతో పెండింగ్ లో ఉన్న సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావడం.. ఇప్పటి వరకు లోక్ సభ ఎన్నికలు హడావుడి ఉండటంతో బిజీగా ఉన్న రేవంత్ ఇప్పుడు పరిపాలనపై దృష్టి సారించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు కావొస్తుండటంతో.. ఈ పదేళ్లలో పరిష్కారం కానీ విభజన హామీలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటు ఉమ్మడి సమస్యల గురించి అధికారులతో చర్చిస్తున్నారు. పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఆ చట్టంలో పేర్కొన్నారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10 కింద ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆస్తులు, అప్పులు చేర్చారు. ఐతే ఈ పదేళ్లలో ఆస్తులు, అప్పులు పంపకం 80 శాతం మేర పంపకం పూర్తి చేశారు. ఇంకా కొన్ని అపరిష్కృతంగా మిగిలిపోవడం, మరి కొన్నింటిపై పీటముడి ఏర్పడింది. వీటిని వీలైనంత త్వరగా అంటే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడేలోగా పరష్కరించాలని యోచిస్తున్నారు.

ముఖ్యంగా ఆర్టీసీ, సింగరేణి, ఎన్టీపీసీ, దిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఫిల్మ్ డెవలప్ మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలెప్ మెంట్ ఫండ్ వంటి ఆస్తులపై పీటముడి నెలకొంది. అంతేకాకుండా తెలంగాణ విద్యుత్ సంస్థలకు పవర్ యుటిలిటిస్ కింద రూ.12 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే వేగం పెంచడం వెనుక కారణం ఏమైఉంటుందని విశ్లేషకులు ఆలోచన చేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన చంద్రబాబు ప్రియ శిష్యుడు. ఒకవేళ ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కూర్చొని చర్చించుకొని సమస్యలపై పరిష్కారం చేసుకుంటారు. అదే జగన్ వస్తే మాత్రం లీగల్ గా ముందుకెళ్తారు. అంటే ఏపీ ఫలితాల లోగా వీటి గురించి తేల్చమనడంతో పాటు ఏపీకి కేటాయించిన భవనాలు తిరిగి స్వాధీన పరచుకోవాలని రేవంత్ ఆదేశించారు. అంటే ఏపీలో ఎవరు గెలుస్తారు అనేదానిపై తెలంగాణ సీఎంకు సమాచారం ఉందా అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆయన ముందు జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: