కెసిఆర్ : కడియం శ్రీహరి అందుకే పార్టీ నుండి వెళ్లిపోయాడు..?

Pulgam Srinivas
భారత రాష్ట్ర సమితి (బీ ఆర్ ఎస్) పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కెసిఆర్ తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . అందులో భాగంగా ఈయన కడియం శ్రీహరి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాజకీయాలు అనూహ్యంగా ఉంటాయి . ఎప్పుడు ఎవరు ఎటు వెళ్తారో ఎవరికి తెలియదు . దానికి ముఖ్య ఉదాహరణ కడియం శ్రీహరి. కడియం శ్రీహరి కి బీఆర్ఎస్ పార్టీలో ఎంతో స్వేచ్ఛ, స్వతంత్రాలు ఇచ్చాము.

ఆయనకు పార్టీలో అత్యున్నత స్థాయిని ఇచ్చాము. అలాగే మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో తన కూతురు అయినటువంటి కావ్య కు వరంగల్ ఎంపీ సీటును కూడా ఇచ్చాం... అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అని చెప్పారు . ఇంతకంటే స్వేచ్ఛ ఏ పార్టీలో ఉంటుంది. ఆయన ఓడిపోయినా కానీ పక్కనే ఉంచుకున్నాం.

గెలిచినప్పుడు ఎంతో గొప్ప పదవులను ఇచ్చాము . ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ని కూడా ఇచ్చి ఆయనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చాం . ఇక ఆ తర్వాత తన కూతురికి కూడా టికెట్ ఇవ్వడానికి (బీ ఆర్ ఎస్) పార్టీ ముందుకొచ్చింది. ఇంత గొప్పగా ఓ వ్యక్తిని, ఓ కుటుంబాన్ని మా పార్టీ గౌరవిస్తే ఆయన మాత్రం పక్క పార్టీలోకి వెళ్ళాడు.

ఆయన పక్క పార్టీలోకి వెళ్లడం మాకు చాలా మంచిది అయ్యింది. అక్కడ ఆయన వెళ్లిపోవడంతో మా కాండిడేట్ కు చాలా బలం వచ్చింది. అక్కడ మేమే గెలుస్తాం. గెలవడం కూడా అదేదో మామూలు మెజారిటీతో కాదు. కడియం శ్రీహరి పై మా పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. అది మీరు రిజల్ట్ డే రోజు చూడబోతున్నారు అని కెసిఆర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: