గుంటూరులో ' పెమ్మ‌సాని ' మీద రూపాయికి 5... ' మాధ‌వి ' మీద రూపాయికి రూపాయి... ఎంతైనా కాసుకోండి...!

RAMAKRISHNA S.S.
- పెమ్మ‌సాని గెలుపు ఏక‌ప‌క్షం అంటూ భారీ బెట్టింగులు
- మంత్రి ర‌జ‌నీ - మాధ‌విపై ఈక్వ‌ల్‌గా పందాలు
- గుంటూరులో హాట్ టాపిక్‌గా బెట్టింగులు
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడతారు..? అనేదానిపై బెట్టింగులు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే కర్ణాటక, తెలంగాణ ఎన్నికలతో పోలిస్తే కూడా ఏపీలో గెలుపు.. ఓటముల‌పై కోట్లాది రూపాయలు చేతులు మారేందుకు రంగం సిద్ధం అవుతుంది. రకరకాల పందాలు జరుగుతున్నాయి. సీఎం ఎవరో అవుతారు అనేదానితో మొదలుపెట్టి.. నియోజకవర్గాల్లో ఎవ‌రు గెలుస్తారు అనే వ‌ర‌కు ర‌క‌ర‌కాల‌ బెట్టింగులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు జిల్లాలోని గుంటూరు పార్లమెంట్ సీటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ పెమసాని చంద్రశేఖర్ గెలుపు పై భారీ ఎత్తున బెట్టింగులు క‌డుతున్నారు. గుంటూరు నగరంలోని కోరిటిపాడు వాకర్స్ ట్రాక్ దగ్గర ప్రతి రోజు కోట్లాది రూపాయల బెట్టింగ్ నడుస్తోంది.

పెమ్మసానికి గెలిస్తే మాకు లక్ష రూపాయలు ఇవ్వండి చాలు.. అదే పెమ్మసాని ఓడిపోతే మేము 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంతైనా తెచ్చుకోండి అని మరి సవాల్ విసిరి పెమ్మసాని గెలుపుపై పందాలు కడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ చాలా సింపుల్గా గెలిచే సీట్లలో గుంటూరు పార్లమెంటు సీటు ఒక‌టిగా రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు లోకేష్ పోటీ చేస్తున్న.. మంగళగిరి, ఇటు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తున్న పొన్నూరు నియోజకవర్గాలు.. గుంటూరు పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి.

ఈసారి రాజధాని మార్పు ప్రభావంతో పాటు ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత.. ఇవన్నీ ఇక్కడ టీడీపీకి బాగా ప్లస్ అవుతాయని లెక్కలు వేస్తున్నారు. దీనికితోడు పెమ్మసాని ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు.. డబ్బు భారీగా ఖర్చు చేస్తుండటం.. ఆయన క్లీన్ ఇమేజ్ తో మంచి స్వభావంతో ప్రజల్లోకి దూసుకువెళుతుండ‌డం కూడా పెమ్మసానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి తోడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య.. పొన్నూరు ఎమ్మెల్యే గానే దారుణంగా విఫలమయ్యారు. కేవలం క్యాస్ట్ ఈక్వేషన్ నమ్ముకుని జగన్ రోశయ్యను నిలబెట్టినా.. రోశయ్య పెమ్మ‌సానికి పోటీ ఇచ్చే పరిస్థితిలో లేరని ప్రచారం జరుగుతుంది. అందుకే పెమ్మసానికి గెలుపుపై ఏకంగా లక్షకు ఐదు లక్షల చొప్పున పందాలు కాసేందుకు టీడీపీ పందెం రాయుళ్లు రెడీగా ఉన్నారు.

అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పిడుగురాళ్ల మాధవి పోటీలో ఉంటే.. వైసిపి నుంచి మంత్రి విడుదల రజిని పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి రజిని పోటీలో ఉండడంతో.. వైసిపి బెట్టింగ్ రాయిళ్ళు ఉరకలు వేస్తున్నారు. అయితే మాధవి గెలుస్తుందని టీడీపీ బెట్టింగ్ రాయుళ్ళు రూపాయికి రూపాయి ఇస్తాం కాచుకోండి అని సవాళ్లు విసురుతున్నారు. ఏది ఏమైనా రాజధాని ప్రాంతంలో పెమ్మసాని గెలుపుపై రూపాయికి ఐదు రూపాయల రేంజ్ లో బెట్టింగ్ జరుగుతూ ఉండటం.. ఇటు పిడుగురాళ్ల మాధవి గెలుపుపై కూడా గెలుస్తుంద‌ని భారీగా బెట్టింగులు నడుస్తుండటం లోక‌ల్‌గా హాట్‌ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: