కూటమి కోసం త్యాగం.. మంగళగిరి దాటని లోకేశ్‌?

Chakravarthi Kalyan
నారా లోకేశ్..  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టే టీడీపీ ఆశా కిరణం.  అన్నీ కలిసి వస్తే ఏపీ సీఎం అభ్యర్థి.  బహుశా చంద్రబాబుకి ఈ ఎన్నికలే ఆఖరివే అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే 73 ఏళ్లు వచ్చేశాయి. ఈ సారి కి ఎనభైకి చేరువ అవుతారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ రాష్ట్రం అంతా తిరిగి పార్టీ గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని, పార్టీని క్యాడర్ ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ ఆయన ఏపీ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.

ఎన్నికలకు ఏడాదికి ముందు యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టిన ఆయన ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు. తిరిగి శంఖారావం సభలు నిర్వహించారు. దాదాపు ఇవి అన్ని జిల్లాలో సాగాయి. ఇక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారు అనుకునే తరుణంలో లోకేశ్ మాత్రం మంగళగిరి దాటి రావడం లేదు. కనీసం టీడీపీ కూటమి సభలో కూడా ఎక్కడా  కనిపించడం లేదు. ఈ సభల్లో చంద్రబాబు, పవన్ లు మాత్రమే దర్శనమిస్తున్నారు.

లోకేశ్ ఎందుకు ప్రచారానికి దూరంగా ఉంటున్నారనే చర్చ అటు టీడీపీ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. దీనిపై టీడీపీ నాయకులకు స్పందిస్తూ ముందు ఆయనకు మంగళగిరి అత్యంత ప్రతిష్ఠాత్మకం అని.. ఆ తర్వాతే రాష్ట్ర రాజకీయాలు అని చెబుతున్నారు.
అయితే సీఎం జగన్ పై  విమర్శలు చేస్తున్నారు తప్పం మంగళగిరి పొలి మేర మాత్రం దాటడం లేదు. ఒకవేళ లోకేశ్ ప్రచారానికి వస్తే ఆయనే సీఎం అనే ప్రచారానికి వైసీపీ నాయకులు తెర తీసే ప్రమాదం ఉంది.  

కూటమి మధ్య పొరపొచ్చాలు రాకుండా ఉండేందుకు కూడా చంద్రబాబు లోకేశ్ ని దూరం పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. లోకేశ్ మీటింగ్ లకు హాజరు అయితే ఆయన్ను భవిష్యత్తు నేతగా ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది కూటమిలో విభేదాలకు కారణం అవుతుంది. అందుకే లోకేశ్ ఎక్కడా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: