గుంటూరులో ఐటీ టవర్స్.. కొత్త ఆశలు కల్పిస్తున్న బాబు?

Chakravarthi Kalyan
గుంటూరులో ఐటీ టవర్స్‌ కట్టి ఉపాధి కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.అమరావతిపై కక్షగట్టి జగన్ నాశనం చేశారని లేకపోతే గుంటూరు, విజయవాడ ప్రపంచస్థాయి నగరాలుగా అభివృద్ధిని చెంది ఉండేవని చంద్రబాబు అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. మూడురాజధానులు పేరిట వైసీపీ మూడుముక్కలాట ఆడిందన్న  చంద్రబాబు అమరావతిపై వారి అభిప్రాయం ఏంటో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
జగన్‌ను మరోసారి నమ్మితే ఆస్తులపై రాష్ట్ర ప్రజలు ఆశలు వదులుకోవాల్సిందేనని.   చంద్రబాబు హెచ్చరించారు. కొత్త భూహక్కు చట్టంతో ప్రజల ఆస్తుల రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు...తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే పెడతామని హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తులన్నీ కొట్టేసేలా జగన్ దుష్టపన్నాగం పన్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకు బెదిరించే ఆస్తులు లాక్కున్నారని...కొత్త భూ హక్కు చట్టం ప్రకారం వారే వివరాలన్నీ తారుమారు చేసి తమ పేరిట రాసేసుకుంటారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: