మామ కోసం కోడలు.. కాంగ్రెస్ తరపున ప్రచారానికి రెడైన హీరో వెంకటేష్ కూతురు?

praveen
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో విజయాలు సాధించాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల లాగానే ఇక ఈసారి కూడా సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి అభ్యర్థిగా బలిలోకి దిగారు. ఖమ్మం సీటు కోసం కీలక నేతలందరూ కూడా కర్చీఫ్ వేసుకొని కూర్చున్నప్పటికీ.. ఇక అటు పొంగులేటి మాత్రం పట్టుబట్టి మరీ తన వియ్యంకుడికి సీటు ఇప్పించుకున్నారు.

 ఈ క్రమంలోనే రామసహాయం రఘురామిరెడ్డి గెలుపు బాధ్యతలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  భుజాన వేసుకొని ప్రస్తుతం ఆయన వెంటే ఉంటూ ప్రచార నిర్వర్తిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రఘురాం రెడ్డి తరఫున ప్రచారం కోసం ఇప్పుడు అనుహ్యంగా సరికొత్త పేరు మీదకి వస్తున్నాయి. ఏకంగా ఖమ్మం లోక్సభ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి తరఫున హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయబోతున్నారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.మే 7వ తేదీన ఆయన ప్రచార రంగంలోకి దిగి రఘురామిరెడ్డికి మద్దతుగా ఓట్లు వేయాలని ఓటర్లకు అభ్యర్థించబోతున్నారు.

 వెంకటేష్ మాత్రమే కాదు ఆయన పెద్ద కూతురు అశ్రీత కూడా ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారట. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితకు ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామిరెడ్డి మామ అవుతారు. ఎందుకంటే రఘురామిరెడ్డి పెద్ద కొడుకుని అటు ఆశ్రత వివాహం చేసుకుంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఆశ్రిత పాల్గొన్నారు. రఘురాంరెడ్డి గెలిస్తే ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేస్తారు అనే విషయాలను ఆమె వివరించారు. రఘురామిరెడ్డి గారిని గెలిపిద్దాం అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఇలా రఘురామిరెడ్డి గెలుపు కోసం ఏకంగా వెంకటేష్ సహా ఆయన కూతురు కూడా ప్రచారం లోకి దిగడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: