ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అంటే.. ఏంటో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా ఇంకొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఇక అన్ని పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయ్.  గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ కూడా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఇలా ఎక్కడికక్కడ ప్రచారహోరూ కనిపిస్తూ ఉండగా ఆయా పార్టీలు అభ్యర్థులు తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై ఇక ఎన్నో హామీలు కూడా కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా డిపాజిట్ గల్లంతు అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఏకంగా పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న సమయంలో ఏకంగా డిపాజిట్ గల్లంతు అవుతుంది అంటూ ప్రత్యర్థి పార్టీలను నాయకులు హెచ్చరించడం చేస్తూ ఉంటారు.

 ఇక విమర్శలలో భాగంగానే ఇలా అంటారని కొంతమంది అనుకుంటారు. డిపాజిట్ గల్లంతు అంటే ఏంటి అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇంతకీ ఈ డిపాజిట్ గల్లంతు అంటే ఏంటంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో నిర్దేశిత రుసుమును ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం తిరిగి పొందాలి అంటే డిపాజిట్ రావాలి. అంటే మొత్తం ఓట్లలో ఆరో వంతు అంటే కనీసం 16% ఓట్లు.. ఇలా నామినేషన్ వేసిన అభ్యర్థికి రావాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వస్తే నామినేషన్ వేసిన సమయంలో డిపాజిట్ చేసిన మొత్తం వెనక్కి ఇవ్వరు. ఇక దీనినే డిపాజిట్ గల్లంతు అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: