విడుదలకి సిద్ధం అవుతున్న అల్లరోడు...!!

murali krishna
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకుడు.చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు.కొన్నాళ్లుగా సీరియస్ సబ్జెక్టుల దారిలో వెళ్లిన అల్లరి నరేశ్.. మళ్లీ తన మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‍మెంట్‍తో 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం చేశారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. మే 3వ తేదీనే ఆ ఒక్కటి అడక్కు చిత్రం థియేటర్లలో విడుదల కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద అల్లరి నరేశ్ తన స్టైల్ లో కామెడీ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.. ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తయింది.
ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ నుఅందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2 గంటల 14 నిమిషాల నిడివితో ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ కానుందని తెలిపారు. చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ తన కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ మధ్యకాలంలో సీరియస్ పాత్రలు చేస్తూ కనిపించిన నరేష్.. మళ్లీ ఈ సినిమాతో కామెడీ పంథాను ట్రై చేస్తున్నాడు.
ముప్పై ఏళ్ళు దాటినా కూడా పెళ్లి కానీ యువకుడు పడే బాధలను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా ప్రతి ఒక్క కుర్రాడికి నచ్చుతుందని మేకర్స్ తెలిపారు. ఇక సెన్సార్ తో పాటు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. చాలా గ్యాప్ తరువాత నరేష్ కామెడీ సినిమాతో వస్తుండడంతో బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆ ఒక్కటి అడక్కు మూవీలో అల్లరి నరేశ్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటించారు. వెన్నెల కిశోర్, జామీ లేవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ, హరితేజ కీరోల్స్ చేశారు. మల్లీ అంకం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓసారి వాయిదా పడిన ఈ మూవీ.. ఎట్టకేలకు మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.‘ఇదొక యూనివర్సల్ పాయింట్ తో రూపొందిన సినిమా అని, ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే కుర్రాడిగా హీరో అల్లరి నరేష్ కనిపిస్తాడని, పెళ్లీడు వచ్చినప్పటికీ పెళ్లి కాకపోవడంతో అతను పడే మనోవేదనని వినోదాత్మకంగా చూపించారని అంటున్నారు. అలాగే ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోల వల్ల జరిగే మోసాలు కూడా ఇందులో చూపించి ఓ మెసేజ్ కూడా ఇచ్చారని సెన్సారు వారు తెలియజేశారు. మొత్తానికి ఇది కచ్చితంగా అల్లరి నరేష్ కి మంచి సక్సెస్ ను అందిస్తుంది అని వారు ధీమాగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: