ముందే లెక్కలేసుకున్న కేసిఆర్.. పీఎం అవుతాడట?

praveen
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అనే ఒక నినాదాన్ని పట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో అనుకున్నది సాధించాం ఇక కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకున్నారు. దేశ్ కి నేత అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కోసం వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ చర్చలు కూడా జరిపారు. అయితే ఇక ఇప్పుడు ఎన్డీఏ, ఇండియా కూటమిని కాదని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందా అని అడిగితే కెసిఆర్ అవును అనే సమాధానం చెబుతూ ఉన్నారు.

 ఇటీవల కాలంలో పెద్ద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల బలం అంతకంతకు పెరుగుతుంది. దీంతో ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని అటు గులాబీ దళపతి కేసీఆర్ చెబుతూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే పూర్తయిన మొదటి, రెండో విడత పోలింగ్ శైలిని గమనిస్తే  బిజెపి కూటమికి గాని ఇండియా కూటమికి గానీ సానుకూల పవనాలు లేవు అన్న విషయం అర్థమవుతుంది అంటూ కేసిఆర్ అనుకుంటున్నారట. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశ రాజకీయాలలో అనూహ్యమైన   పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఇక కెసిఆర్ భావిస్తున్నారట.

 అందుకే తెలంగాణలో గౌరవప్రదమైన సీట్లను దక్కించుకోవడం ద్వారా కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఇక చక్రం తిప్పచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రమంతటా తిరిగేందుకు బస్సుయాత్ర ప్రారంభించారు అన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ సీట్లు తమవే అంటూ కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తు.. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ చెప్పినట్లుగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందా.. అంతకుముందు కేసీఆర్ తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: