ఏపీ లోకల్ టాక్: ధర్మవరంలో వైసీపీకి గట్టి పోటీ.. అయినా చరిత్ర రిపీట్..?

Suma Kallamadi
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 13న ముగిసాయి. ప్రస్తుతానికి కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంపై అందరి దృష్టిపడింది. ఇక్కడ వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇంత ముందు ఇక్కడి నుంచి ఆయన గెలిచారు. ఈసారి కూడా అతని విజయం ఖాయమని అందరూ ఫీలవుతున్నారు. అయితే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ మంచి అతనికి గట్టిగానే పోటీ ఎదురైనట్లు ఓటింగ్ సరళిని బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎన్డీయే కూటమి తరఫున నిల్చున్న సత్యకుమార్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ బీసీ ఓటర్లను తన వైపు ఆకట్టుకునేందుకు చాలానే ప్రయత్నించారు. ముదిగుబ్బ మండల అధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ సత్య కుమార్‌కు మద్దతు ప్రకటించారు. ఇంతకుముందు ఆయన వైసీపీ కోసం పనిచేశారు కానీ ఈసారి టీడీపీ + కూటమికి మద్దతు అందించారు. విశేషమేంటంటే ధర్మవరంలో బీసీ ప్రజల ఎక్కువ. అయినా ఐదు దశాబ్దాలుగా ఇక్కడ అగ్రవర్ణాలకు చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఉన్నత కులాల నేతలనే నిలబెడుతున్నాయి. 2024లో ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఎన్డీయే కూటమి బీసీ నేత సత్య కుమార్ యాదవ్‌ను బరిలోకి దింపింది.
ధర్మవరం పట్టణంలో చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్నారు. వారి ఓట్లే 80 వేల దాక ఉంటాయి. అక్కడ వీరితోపాటు బోయ, బలిజ, ఏకుల, కురుబ వంటి కులాల వారు ఉన్నారు. వీరంతా బీసీ సామాజిక వర్గం కిందికే వస్తారు. ఇప్పుడు ఉన్నత కులాల వారిని కాకుండా మనలాంటి వారిని కూడా నేతలు చేయాలంటూ బీసీ కులాలలో సత్య కుమార్ బాగా ప్రచారం చేశారు. అయితే నాయకుడు ఎవరైనా సరే మంచివాడైతే చాలు తమకు మంచి చేస్తే చాలు అని ధర్మవరం ప్రజలు బాగా అనుకుంటారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి అలాంటి మంచి నాయకుడు అని చెప్పుకోవచ్చు. అలానే జగన్ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు ఆ కారణం చేత ఈసారి కూడా ధర్మవరంలో వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి నాయక గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ లో ఆడవారు, వృద్ధులు, పల్లెటూరి ప్రజలు బాగా పాల్గొన్నారు కాబట్టి కేతిరెడ్డి గెలిస్తే భారీ మెజారిటీతోనే గెలవచ్చు. దానివల్ల ఆయన చరిత్ర సృష్టించవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అడుగు పెట్టి కొంతకాలమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: