ఏపీ : డేంజర్ జోన్లో టీడీపీ మూడు సీట్లు.?

FARMANULLA SHAIK
 ఆంధ్రప్రదేశ్‎లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారజోరును ప్రతిపక్ష పార్టీ టీడీపీ,అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ రెండు పెంచాయి.అయితే టీడీపీలో మాత్రం కొన్ని అసెంబ్లీ సీట్లలో మార్పులు చేర్పులు అనేవి జరగనున్నాయి అనే ఒక ప్రచారం వైరల్ అవుతుంది. ఉండి, మడకశిర, మాడుగుల నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు మారుస్తున్నట్లు తెలుస్తుంది.ఉండి టికెట్ అనేది రఘురామకృష్ణరాజుకి అంటూ కొన్ని సాంకేతలు అందుతున్నాయి.దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నచ్చచెప్పే పనుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.ఐనా మాడుగుల టికెట్ పైలా ప్రసాద్ కి బదులుగా బండారు సత్యనారాయణ మూర్తికి ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మడకశిర విషయంలో అభ్యర్థి సునీల్ కుమార్ గూర్చి కూడా అధిష్టానం పునరాలోచన చేస్తుంది.అక్కడ యంఎస్ రాజు మరియు పూజారి సుధీర్ పేర్లను టీడీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఒకటి రెండు రోజుల్లో ఈ మార్పునకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజును టీడీపీ ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించేసింది.రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ టికెట్ కోసం ఆశించారు కానీ కూటమిలో భాగంగా ఆ టికెట్ బీజేపీ కి వెళ్ళింది. అపుడు ఇంకా టీడీపీనే నాకు దిక్కు అన్నట్లుగా అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు.దాంతో టీడీపీ చేసేది ఏంలేక ఉండి అసెంబ్లీ తప్ప ఆయనకు ఇంకా మరో అవకాశం లేకపోవడంతో ఆ టికెట్ ఆయనకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయని అధిష్టానం అంటుంది.ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును చంద్రబాబు పిలిచి మాట్లాడితే దానికి ఆయన నేను పూర్తిగా మద్దతు అయితే చెప్పలేను కానీ నేను మాత్రం రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు.
అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుండి పైలా ప్రసాద్ అభ్యర్థిని అక్కడ ఉన్న నేతలు ఎవరు కూడా ఒప్పుకోకపోవడంతో ఆయన గూర్చి కూడా ఆలోచన చేసినది పార్టీ అధిష్టానం.అసలు ఆయనకు సపోర్ట్ చేసే ఆలోచనలో అక్కడ నేతలు లేరని తెలుస్తుంది.అయితే ఆయన పేరుకి బదులుగా బండారు సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.అలాగే మడకశిర అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో అక్కడ కూడా మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఒకటి రెండ్రోజుల్లో అధిష్టానం దీని మీద పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: