ఏపీ: చిన్న పార్టీల ప్రభావమెంత..?

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో.. కేవలం టిడిపి, బిజెపి, జనసేన పార్టీలె కాకుండా చాలామంది నేతలు సైతం నిలబడ్డారు అయితే ఇందులో కేవలం చిన్న చిన్న పార్టీలె అయినప్పటికీ కూడా ఎంతో కొంత మెరకు ఓట్లను సైతం చిలిచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.

కేఏ పాల్:
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు 2019లో నరసాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. అక్కడ కేవలం 3,018 (0.28%) వరకు ఓట్లు సంపాదించుకున్నారు.2024 లో గాజువాక నుంచి అసెంబ్లి బరిలోకి దిగగా 1000 ఓట్లు పడ్డాయి. ఇక విశాఖ నుంచి ఎంపి స్థానానికి పోటీ చేయగా 7,696(0.55%) ఓట్లు పడ్డాయి..

బీసీవైపి:
2019 ఎన్నికలలో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా బోడె రామచంద్ర యాదవ్ పోటీ చేశారు.. అక్కడ 16,452 (8.4%) వరకు ఓట్లు లభించాయి.2024 లో సొంతంగా బిసివైపి పార్టీని మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను పరిశోధించారు.. పుంగనూరు మంగళూరు గిరి అసెంబ్లీ స్థానాలలో ఆయనే పోటీ చేయగా అక్కడ 4,559 ఓట్లు మాత్రమే వచ్చాయి. మంగళగిరిలో 373 ఓట్లు పడ్డాయి.

జెడి లక్ష్మీనారాయణ:
సిబిఐ అధికారిగా ఉంటూనే విఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జేడీ లక్ష్మీనారాయణ మొదట జనసేన పార్టీలో చేరారు..2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయగా..2,88,874 (23.3%) ఓట్లు పడ్డాయి. 2024 లో సొంతంగా పార్టీ స్థాపించి జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఈసారి కూడా విశాఖ నగర్ నుంచి పోటీ చేయగా 5,160 ఓట్లు వచ్చాయి.

న్యాయవాది జడ శ్రవణ్:
జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక అంశాల పైన స్పందిస్తూ ఉంటారు. తన న్యాయవాది ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఈయన మంగళగిరి నుంచి పోటీ చేశారు కేవలం 416 ఓట్లు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: