వైసీపీ (ఎమ్మెల్సీలు): గడువు ఉంది కానీ.. జాగ్రత్త పడుతున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలలో చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది.. వైసీపీలో ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు అలా నెమ్మదిగా జారుకుంటున్నారు.. అయితే వీరు ఎందుకు వెళ్ళిపోతున్నారనే విషయం మాత్రం ఇప్పుడు నేతలకు అంతు చిక్కడం లేదు.. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులకు కూడా ఈ విషయాల పైన అంతు చిక్కడం లేదు.. ముందుగా వంశీకృష్ణ యాదవ్.. జంగా కృష్ణమూర్తి, సి. రామచంద్రయ్య, ఇక్బాల్ వంటి వారు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అలాగే మరొక వైసీపీ నేత కూడా బయటికి వెళ్ళబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

బయటకు వెళ్లిన వారిలో కేవలం ఒక్క వంశీకృష్ణ యాదవ్ తప్ప మరెవరికి కూడా టికెట్లు కానీ పదవి కానీ ఇతర పార్టీలలో అవకాశాలు కూడా రాలేదు.. ముఖ్యంగా పార్టీ న్యాయకత్వంలో ఎలాంటి గొడవలు లేని ఎమ్మెల్సీలు వీరు.. కానీ ఇలా బయటికి వచ్చేయడంతో వైసిపిలో అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వీరికి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవులకు గడువు  ఇంకా రెండు మూడు ఏళ్ల సమయం ఉన్నప్పటికీ.. ముందుగానే ఇలా  వీరు రాజీనామా చేస్తున్నారు.

పదవి కాలం ఉన్నా.. అప్పుడే బయటకు వచ్చేస్తున్నారని... బయటికి వచ్చిన ఎమ్మెల్సీలు ఇద్దరు బీసీలు ఒక బలిజ, ఒక మైనారిటీ నాయకులు కావడం గమనార్హం.. సీఎం జగన్ ప్రతిరోజు కూడా మేమంతా సిద్ధం సభలో వీరందరిని నా వర్గాలు అంటూ చెబుతూ ఉండగా ఇప్పుడు ఆ వర్గాల వారే బయటికి వచ్చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. పదవి పోయాక పదవుల కోసమే వెళ్లే రాజకీయ నేతలు ఉన్న పరిస్థితులలో పదవి కాలం ఉన్నప్పటికీ వైసీపీ పార్టీని వీడుతూ ఉండడంతో.. చాలామంది నేతలు సైతం వీరందరికీ వీరి భవిష్యత్తు ఏంటో తెలిసిపోయింది అందుకే ఇలా ముందు జాగ్రత్త పడుతున్నారేమో అంటూ తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎంతమంది ఎమ్మెల్సీలు బయటికి వస్తారో చూడాలి. మొత్తానికైతే గడువు ఉండగానే మీరు ఇలా రిజైన్ చేస్తూ జాగ్రత్త పడుతున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: