
పుష్ప-2.. 2025 సంక్రాంతికి పోతుందా?
అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ మూవీని విడుదల చేయాలని అటు చిత్ర బృందం కూడా నిర్ణయించింది. దీంతో అభిమానులు ఇక ఈ మూవీ విడుదల కోసం వెయ్యికలతో ఎదురుచూస్తున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూశారు. కానీ ఇంతలోనే అభిమానులు అందరికీ కూడా నిరాశ ఎదురయింది. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన విడుదల కావలసిన పుష్ప 2 సినిమా చివరికి వాయిదా పడే పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే పలుమార్లు షెడ్యూల్ వాయిదా పడటం మరోవైపు కొన్ని సీన్స్ ద్వారా సంతృప్తి చెందని డైరెక్టర్ సుకుమార్ మళ్లీ రిషూట్ చేసేందుకు రెడీ కావడంతో.. ఆగస్టు 15వ తేదీన చిత్ర బృందం ఇక సినిమాను విడుదల చేయలేకపోతోంది అనేది తెలుస్తుంది. దీంతో కొత్త విడుదల తేదీ ఏది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరు ఆశక్తి చూపిస్తున్నారు. అయితే ఆగస్టు 15 నుంచి పుష్ప 2 తప్పుకోవడంతో కొత్త విడుదల తేదీ కోసం అటు మేకర్స్ కూడా అన్వేషిస్తున్నారట. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను దృష్టిలో పెట్టుకొని రెండు డేట్స్ ని పరిశీలిస్తున్నారట డిసెంబర్ 5న రిలీజ్ చేస్తే యుఎస్ లో వారం రోజులు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని అనుకుంటున్నారట. లేదంటే డిసెంబర్ 20న రిలీజ్ చేస్తే భారత్లో క్రిస్మస్, న్యూ ఇయర్, హాలిడేస్ కి మూవీకి భారీగా కలెక్షన్స్ తెచ్చి పెడతాయని అనుకుంటున్నారట. ఇక ఏ తేదీని ఫిక్స్ చేస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం వరుసగా రీ షూట్స్ చేయడం చూస్తూ ఉంటే కనీసం డిసెంబర్లో అయినా ఈ సినిమా విడుదలవుతుందా లేదా సంక్రాంతి వరిలోకి నిలుస్తుంది అన్నది అందరూ అనుకుంటున్న మాట.