ఏపీ: ఈవీఎం హ్యాకింగ్.. ఆ అనుమానాలు నిజమేనా..?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన చాలా ప్రాంతంలో ఈవీఎం హ్యాకింగ్ పై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో మనం అనుమానించే ఈ అనుమానాలు కొన్ని ఘటనలు చూస్తే నిజమనే అనిపిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఈవీఎం హ్యాకింగ్ మీద ఎలన్ మస్క్ ఎప్పుడు స్పందించారో అప్పటినుంచి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది.ఈవీఎం లు హ్యాక్ చేయచ్చు వీటికి ఏ డివైస్ కనెక్ట్ కాకున్నా హ్యాక్ చేయవచ్చని ఆయన చాలెంజ్ విసిరారు. రాహుల్ గాంధీ కూడా ఈవీఎం బ్లాక్ బాక్సులు అని ఖండించారు. ఈ దేశంలో ఎంతోమంది కమ్యూనిస్టులు మరియు పెద్దపెద్ద నాయకులు ఖండించారు. ఈవీఎంలకు ఏ బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అవ్వదు కాబట్టి ఎవరు హ్యాక్ చేయలేరని ఈసీ అంటుంది. ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్ ఉండదు. ఫ్లాష్ మెమొరీ ఉంటుందని అంగీకరించారు. 

దీంతో ఈవీఎంలను హ్యాక్ చేయడం చాలా ఈజీ అని  ప్రశాంత్ భుషన్ ట్విట్ చేశారు. దీంతో ఈవీఎంలు హ్యాక్ అయ్యే అనుమానానికి బలం చేకూరింది అని చెప్పవచ్చు. దీంతో ఈ నాయకులంతా కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమైపోయారట. ఇదే తరుణంలో మొత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకొని, ఇందులో ఈసీకి 40 లక్షలు మాత్రమే అందించారట. ఇందులో 20 లక్షలు ఈవీఎంలు ఎటు వెళ్లాయి అనేది అనుమానానికి తావిస్తోంది. ఈసీ మాకు తెలియదు అంటుంది కేంద్రం నోరు విప్పదు. ఇదే తరుణంలో ఇండియాలో ఈవీఎం తయారీ సంస్థ వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చామని చెప్పింది.అంతేకాకుండా మరో రెండు లక్షలు ఈవీఎంలు ఇచ్చాం, ఎక్స్ట్రా మూడున్నర లక్షల కంట్రోల్ యూనిట్లు కూడా అందించామని చెప్పింది. ఈ విధంగా 20 లక్షలు ఎక్స్ట్రా ఈవీఎం లు,రెండు లక్షల ఈవీఎంలు ఎటుపోయాయి అనేది చాలా అనుమానాలకు దారితీస్తుంది.  

పిఠాపురం నియోజకవర్గంలో ప్రైవేట్ వాహనంలో ఈవీఎంలు తరలించారనే వార్తలు వచ్చాయి. దీని పై ఈసీ ఏ మాత్రం స్పందించలేదు. ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో కమలం పువ్వు గుర్తు తెలియని చోట్ల కూడా బిజెపి వాళ్లు గెలిచారని తెలుస్తోంది. ఏపీలో ఆదోని, ధర్మవరం చోట్ల అసలు కమలం పువ్వు గుర్తు తెలియదు. క్షేత్రస్థాయిలో జగన్ పై వ్యతిరేకత లేదు.కానీ విపరీతమైన ఓటమి వచ్చింది. 2017 నాటికి 70 ఈవీఎంలు దొంగతనం జరిగాయని కథనాలు కూడా వచ్చాయి.  ఎలక్షన్ కమిషన్ కూడా అవి ఎటు వెళ్లాయో తెలియదని అంగీకారం కూడా తెలిపింది. అలాగే స్ట్రాంగ్ రూముల్లో భద్రత  ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సీసీటీవీ ఫుటేజ్ కేవలం ఈసీకి మాత్రమే యాక్సిస్ ఉంటుంది. కనీసం ఇరు పార్టీల రాజకీయ నాయకుల కైనా సరే దాని యాక్సిస్ ఇవ్వరు. టెక్నాలజీ సూపర్ గా ఉంటుంది ఈవీఎంలు బాగా పనిచేస్తాయని ఈసీ వాళ్ళు చెప్పడం తప్ప  పూర్తిగా ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. బిజెపి లాంటి పార్టీల గుర్తు తెలియని చోట్ల కూడా గెలవడం చూస్తే మాత్రం తప్పక ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని చాలామంది అనుమాన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: