టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ..!
ఇక ఈ మూవీను అనౌన్స్ చేయగానే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు లో వేసిన స్పెషల్ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కథ 1947 నేపథ్యంలో సాగుతున్నట్లుగా టాప్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీకు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. " సంబరాల ఏటి గట్టు " అనే టైటిల్ను హి మూవీకి పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కథకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం పరిశీలించిందట. మరి నిజంగానే తేజ్ సినిమాకు ఇటువంటి టైటిల్ ఫిక్స్ చేశారా అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్సిడెంట్ నుంచి కోల్కున్న అనంతరం విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సాయి ధరం సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సూపర్ హిట్ మూవీ అనంతరం ఈ హీరో చేస్తున్న తదుపరి చిత్రమే ఈ మూవీ. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే గతంలో లాగా ఈయన క్రేజ్ ఇండస్ట్రీలో మారు మోగుతుంది అని చెప్పుకోవచ్చు.