కియా: కత్తి లాంటి ఆ మోడల్ రీకాల్.. సమస్యేంటి?

Purushottham Vinay
స్టార్టింగ్ నుంచి కూడా మంచి అమ్మకాలు పొందుతున్న కియా ఈవీ9.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) కి అందించిన పత్రాలలో.. కియా అమెరికా ఎంపిక చేసిన మోడల్‌లు క్రాష్ సమయంలో హెడ్‌లైనర్ రక్షణ అంత సురక్షితంగా లేదని తెలిపింది. అయితే మే నెలాఖరులో ప్రారంభం కానున్న ఉత్పత్తికి ముందే ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్ సమయంలో వాహన తయారీదారు ఈ సమస్యను కనుగొన్నారు. దీంతో కియా కంపెనీ వెంటనే రీకాల్ ప్రకటించింది.కొరియాలోని కియా యొక్క గ్వాంగ్‌మియాంగ్ ఆటోలాండ్ ప్లాంట్‌లో ఈవీ9 కోసం పరీక్షలని నిర్వహించడం జరిగింది. ఇందులో 2023 సెప్టెంబరు 25 ఇంకా 2024 మార్చి 21 మధ్య ఉత్పత్తి చేయబడిన ఈవీ9 కార్లలో సమస్య ఉన్నట్లు కియా కంపెనీ గుర్తించింది. అయితే ఈ వాహనాలు ఫెడరల్ భద్రతా అవసరాలకు అంత అనుగుణంగా లేవు.ఇది రాబోయే రోజుల్లో తమ కస్టమర్లను ఇబ్బందులో పడేస్తాయేమో అని కియా కంపెనీ రీకాల్ ప్రకటించింది.హెడ్‌లైనర్ సమస్య వల్ల ఎవరికీ ఎటువంటి గాయాలు కానీ క్రాష్ వంటివి కానీ జరగలేదు.


 ఈ సమస్య ఉన్న కార్ల ఓనర్లకు కంపెనీ త్వరలోనే నోటిఫికేషన్ లెటర్లను పంపించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఎలాంటి రుసుము కూడా వసూలు చేయదు. సమస్య ఉన్న కార్లని కంపెనీనే స్వయంగా గుర్తించి ఉచితంగానే భర్తీ చేస్తుంది. కాబట్టి ఈ కార్లని కొన్న కస్టమర్లు మళ్ళీ డబ్బు చెల్లించలేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు.కియా కంపెనీ ఈ ఏడాది మే నెల చివర్లో తన జార్జియా ప్లాంట్‌లో అమెరికాలో స్థానికంగా అసెంబుల్ చేసిన ఫస్ట్ ఈవీ9 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. అమెరికాలోని ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు 99.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ని పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 489 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం తెలుస్తుంది. ఇది 389 Bhp పవర్ ఇంకా అలాగే 700 న్యూటన్ మీటర్ టార్క్ ని అందిస్తుంది.కియా తన ఈవీ9 ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ దీన్ని లాంచ్ చేసే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కారు వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును కూడా గెలుచుకుంది. కంపెనీ ఈ కారును ఇండియాలో లాంచ్ చేయడానికి ముందు పలు విధాలుగా టెస్ట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KIA

సంబంధిత వార్తలు: