రాంగ్ కాల్స్ రాకుండా సూపర్ ఫీచర్ తెచ్చిన గూగుల్?

ఫోన్ అన్నాక నిరంతరం చాలా రకాల కాల్స్ అనేవి వస్తుంటాయి. అయితే వాటినన్నింటికీ కూడా మనం సమాధానాలు చెబుతూ ఉంటాం. మనకు ఫోన్ చేసిన వారిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, కోలిగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు.అయితే కొన్నిసార్లు తెలియని నంబర్ల నుంచి కూడా ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఏదొక ముఖ్యమైన పనిలో ఉంటాం. హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అది ఏ వ్యాపార సంస్థ కాలో కావచ్చు. దీనివల్ల మనకు ఖచ్చితంగా చిరాకు అనిపిస్తుంది. మూడ్ పాడవుతుంది. సరిగ్గా మన పనులపై దృష్టి పెట్టలేము.అయితే ఈ అన్‌నోన్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ కంపెనీ చర్యలు చేపట్టింది. దీనికోసం గాను లుకప్ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ విడుదల చేసింది. అన్ నోన్ (తెలియని) కాలర్లను గుర్తించడంలో ఇది మనకు సహాయ పడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 


దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.ఇక పిక్సెల్ ఫోన్ వినియోగించేవారు అన్‌నోన్ కాల్స్‌ను గుర్తించడం చాలా బాగా తేలికైంది. గూగుల్ విడుదల చేసిన లుకప్ ఫీచర్ తో వారికి మరింత సౌలభ్యం అనేది లభించింది. అన్ నోన్ కాల్స్ కు సమాచారం ఇవ్వాలా, వద్దా అనే విషయాన్ని వారు చాలా సులువుగా నిర్ణయించుకోవచ్చు.ఇక గూగుల్ కంపెనీ తీసుకువచ్చిన ఈ లుకప్ ఫీచర్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది సర్వర్ సైడ్ అప్ డేట్. అంటే ఫోన్ యాప్ కు సంబంధించిన కొత్త వెర్షన్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే అవసరం ఉండదు.ఈ ఫీచర్ ద్వారా తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించవచ్చు. దీనిని గతంలో జపాన్‌ దేశంలో విడుదల చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా గూగుల్ పిక్సెల్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తున్నారు. మన కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు లిస్టులో కనిపిస్తుంది. దానిని నొక్కగానే సాధారణంగా యాడ్ నంబర్, మెసేజ్, హిస్టరీ అనే ఆప్షన్లు మనకు కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: