నా ఒక్కడి వల్లే పాకిస్తాన్ ఓడిపోలేదు.. బాబర్ షాకింగ్ కామెంట్స్?

praveen
పాకిస్తాన్ జట్టు  ప్రస్తుతం వరల్డ్ కప్ టోర్నీలో ఎప్పుడు మాజీ ఛాంపియన్గా బరిలోకి దిగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరెట్లలో ఒకటి గానే క్రికెట్ విశ్లేషకులు కూడా పాకిస్తాన్ జట్టు గురించి భావిస్తూ ఉంటారు. అయితే ఇలా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే పాకిస్తాన్ జట్టూ గత కొంతకాలం నుంచి ఎందుకో అంచనాలను అందుకోలేక పోతుంది. ఇక వరల్డ్ కప్ టోర్నీలలో చెత్త ప్రదర్శన చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది.

 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో కూడా ఇదే చేసింది. ఏకంగా చిరకాల ప్రత్యర్థి అయినా  భారత్ను ఓడించి ఇక వారి సొంత గడ్డ మీదే వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అనే కసితో బరిలోకి దిగింది పాకిస్తాన్. కానీ కనీసం సెమీఫైనల్ కూడా చేరుకోలేదు. చెత్త ప్రదర్శన చేస్తూ లీగ్ దశ నుంచి టోర్నై నుంచి నిష్క్రమించి.. ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక ఈ వరల్డ్ కప్ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల మళ్ళీ బాబర్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది  పాకిస్తాన్ జట్టు. ఈసారి తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుస పరాజయాలతో చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 మొదటి మ్యాచ్ లోనే అటు పాకిస్తాన్ జట్టు చిన్న టీం అయిన యుఎస్ఏ చేతిలో ఓడిపోయి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇక ఆ తర్వాత భారత్ చేతిలో కూడా ఓటమిపాలు అయింది  ఈ రెండు ఓటమిలతో ఆ జట్టు సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశాలను క్లిష్టతరంగా మార్చుకుంది. ఇక ఇటీవల చివరికి లీగ్ దశ నుంచే వరల్డ్ నుంచి నిష్క్రమించింది. దీంతో విమర్శలు వస్తుండగా ఈ విషయంపై కెప్టెన్ బాబర్ స్పందించాడు. మేం ఒక ఆటగాడి వల్ల ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం జట్టుగానే ఓడిపోయాం. అందరూ కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ నేను 11 మంది స్థానాల్లో ఆడలేను  టీంలో ఎవరి పాత్ర వారికి ఉంటుంది  ఒకవేళ నేను సారధ్య బాధ్యతలు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటే అందరి ముందు ప్రకటిస్తా అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: