గుండు కొట్టించుకున్న.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియాలో తల గుండుతో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ ఎవరో గుర్తుందా..? ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించి అందరిని అక్కటుకుంది. ఆమె అనేక ఇతర చిత్రాలలో సహాయ నటిగా నటించి ప్రేక్షకులను అక్కటుకుంది. మన తెలుగులో అయితే కేవలం ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్‌ గా నటించింది. అయితే, యువత ఆమెను బాగా రిసీవ్ అక్కటుకోవడంతో పాటు సూపర్ హిట్ కూడా సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా.. మన తెలుగులో మాత్రం హీరోయిన్‌ గా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మాత్రమే నటించింది. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం అయ్యింది.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరన్న విషయానికి వస్తే.. ఆమె మరెవరో కాదు ' 10వ తరగతి' సినిమా హీరోయిన్ శరణ్య. ఆమె ఇటీవల తమిళనాడులోని ప్రముఖ దేవాలయం తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం అక్కడికి వెళ్లి., దేవుడి ముక్కు కోసం ఆమె తలనీలాలూ స్వామికి ఇవ్వడం ఇప్పడూ వైరల్ గా మారింది. అంతే కాదు ఈ హీరోయిన్ శరణ్య నాలుక పై శూలం పొడిపించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను శరణ్య సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త సోషల్ నెట్‌వర్క్‌ లలో వైరల్‌ గా చక్కర్లు కొడుతుంది.
నిజానికి అమ్మాయిలు చాలామంది ఎక్కువ  జుట్టును ఇష్టపడతారు. ఎంత ఎక్కువ కాలం జుట్టు పెరిగితే అంత అందంగా కనిపిస్తారని అందరు అనుకుంటారు. అందుకే చాలా మంది అమ్మాయిలు దేవుడి వద్ద ముక్కు కోసం మూడు కత్తెరలు మాత్రమే ఇస్తూ ఉంటారు. అయితే శరణ్య తన వెంట్రుకలన్నీ స్వామికి కానుకగా ఇవ్వడం విశేషం అనే చెప్పాలి. ఈ విషయంపై హీరోయిన్ శరణ్య పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకెందుకు మీరు కూడా ఆ ఫొటోస్, వీడియోలను ఓ సారి చుడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: