ఆంధ్రా రాజకీయం: అంతా ఆ సినిమాలో చూపించనట్టుగానే?

Chakravarthi Kalyan
ఇది సోషల్ మీడియా యుగం. రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ లు ఇస్తూ అనూహ్య పరిణామాలకు దారి తీసేలా చేస్తోంది కూడా సోషల్ మీడియానే.  రాజకీయ పార్టీలకు కూడా బుర్రకు తట్టని వ్యూహాలు వారి ఆశలు ఊహలు అన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.  అలా తామే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి పార్టీలను నాయకులను నడిపించే విషయంలో గత రెండు  ఎన్నికల నుంచి సోషల్ మీడియా పాత్ర చాలా ఎక్కువగా ఉంది.

ఇక్కడి ఎత్తులు, పైఎత్తులు స్ర్టాటజీలస్ కూడా రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకొని తమను తాము సరిదిద్దుకొని ముందుకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా నిర్వహించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీలు, పత్రికలు ఒక్కటి కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రజలకు చేరువై విజయం సాధించింది.

ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఇరు పార్టీలు కూడా సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకొని జనాలను ప్రభావితం చేస్తున్నాయి. వైసీపీ ఐ ప్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలతో పాటు టీడీపీ పై వ్యతిరేక కామెంట్లు పెడుతూ పైచేయి సాధిస్తుంటే.. టీడీపీ తరఫున ఐటీడీపీ పనిచేస్తోంది. సుమారు 500 నుంచి 1000 మంది వరకు సోషల్ మీడియా వారియర్స్ ప్రత్యేకంగా ఆయా పార్టీల కోసం పనిచేస్తున్నారు.

డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారికి చక్కని ఉపాధి లభించదనే చెప్పవచ్చు. మీమ్స్, సెటైర్లు, చక్కటి వ్యాఖ్యానాలు.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీని వెనుక పెద్ద తతంగమే ఉంది. ఒక ఆఫీస్.. మానిటరింగ్.. సిస్టం వీరందరకీ వేలకు వేలు జీతాలు.. తమిళ్ హీరో సూర్య నటించిన ఎన్జీకే  సినిమా మాదిరి చేస్తున్నారు. ప్రజలను ఎలా మనవైపు తిప్పుకోవచ్చు అనేది ముందుగానే తన సినిమాలో సూర్య చూపించారు. రాజకీయాలు అంటే గతంలో లాగా సైద్ధాంతికత, నైతిక విలువలతో కూడినది కాదు. అంతా మ్యానిక్యులేట్ రాజకీయాలే నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: