అనకాపల్లి : మాడుగుల అసెంబ్లీ టికెట్ పై రచ్చ రచ్చ..?

FARMANULLA SHAIK
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.అనకాపల్లి జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నుండి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈసారి లోకసభ ఎన్నికల్లో ప్రాతినిద్యం వహిస్తూ బరిలోకి దిగుతుంటే ఆయన కూతురు అనురాధ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.దాంతో ఆయన ఇద్దరు తనయులు తండ్రిపై తిరుగుబాటు  చేయటంతో వారి కుటుంబంలో విబేధాలు తలెత్తాయి.దీనితో ఆమె సోదరుడు రవి సోదరికిపై ఇండిపెండెంట్గా లేదా కాంగ్రెస్ నుండి పోటీచేయడానికి రెడీ అవుతున్నారు.ఈ అంశం ప్రస్తుతం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.గ్రామ పంచాయితీ సర్పంచ్ నుండి అంచలంచలుగా ఎదిగిన ముత్యాలనాయుడు 2019 ఎన్నికల్లో మాడుగల నుండి గెలిచి సీఎం జగన్ కేబినెట్ లో ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.కాంగ్రెస్ లో రాజకీయ జీవితం ప్రారంభించిన వైసీపీ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయనఉప ముఖ్యమంత్రి ఐన తన నియోజకవర్గంలో మాత్రం ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా చలాయిస్తారనే టాక్ ఉంది.మంత్రి ఐనప్పటి నుండి ఆయన సంపాదన బాగానే ఉండడంతో ఎంపీ టికెట్ వచ్చిందని కొంతమంది నేతలు అంటున్నారు.మంత్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు.కొడుకు రవికు వైసీపీ పార్టీలోని కీలక నేతలతో మంచి పరిచయాలే ఉన్నాయి. ఆయన మొదట దేవరపల్లి జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.కానీ వైసీపీ అధిష్టానంతో వెనక్కి తగ్గారు. అయితే అదే టైంలో అనురాధకి కోటపాడు జడ్పీటీసీ గా టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు బూడి ముత్యాల నాయుడు అప్పటినుండి తండ్రి తనయుల మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయి.కానీ తండ్రి మాత్రమే రాజకీయ వారసురాలు కూతురేనని చెప్పుకోస్తున్నారు.అనురాధకి టికెట్ ఇవ్వడంపై వైసీపీ పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆయన మంత్రి అయినా తర్వాత పార్టీ నేతలందరిని దూరంగా ఉంచారని కూడా గుర్తుచేసుకున్నారు.బూడి రవి పోటీ చేస్తే మాత్రమే తమ మద్దతు రవికేనని వైసీపీ నేతలు అంటున్నారు.ఆయన రెండో భార్య కుమారుడు వెంకటేష్ కూడా తండ్రి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తనతో ఒక్కమాట కూడా చెప్పకుంట అక్కకు టికెట్ ఇప్పించడంపై మండిపడుతున్నాడు.దీనితో మాడుగుల నియోజకవర్గ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: