బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీ లీల... హీరో ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు పరిచయం అయ్యి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా సినిమాల అవకాశాలు దక్కుతున్నాయి. పెళ్లి సందD సినిమా ఈ నటి తర్వాత రవితేజ హీరోగా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించడం , ఇందులో ఈమె తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మరిన్ని కమర్షియల్ సినిమాలలో ఈమెకు అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కొన్ని రోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మాటల మాంత్రికుడు తొలి విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే శ్రీ లీల మరికొన్ని రోజుల్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం నటిస్తున్న దిలేర్ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం వారు ఇప్పటికే శ్రీ లీల ను కలిసి ఈ సినిమా యొక్క కథను , అందులోనే తన పాత్రను వివరించినట్లు దానితో ఈమెకి కూడా ఈ సినిమా కథ , ఆమె పాత్ర నచ్చడంతో ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అన్ని సెట్ అయితే ఈ మూవీ తో ఈ నటి బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: