ఏపీ:ఆ నియోజకవర్గాలలో ఓటింగ్ పై అనుమానం..!

Divya
రాయలసీమలో జగన్ కి మంచిపట్టు ఉందని ఎన్నో సందర్భాలలో బయటపడింది. కానీ వైసీపీకి కంచుకోట లాంటి సీట్లు మాత్రం అనేకనే ఉన్నాయి. అలాగే గ్రేటర్ రాయలసీమలో దాదాపుగా 74 సీట్లు ఉంటే అందులో ఎక్కువ సీట్లు వైసిపి పార్టీని కైవసం చేసుకుంటూ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఒక్కసారిగా అవన్నీ కూడా రివర్స్ అయ్యాయి. రాయలసీమ ప్రాంతంలో భారీగా ఓటమిపాలయ్యారు వైసిపి పార్టీ.. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. చాలా మంది గెలిచే నేతలు ఓడిపోవడంతో పలు రకాల సందేహాలు మొదలవుతున్నాయి..

ముఖ్యంగా చాలామంది వైసిపి అభ్యర్థులు కేవలం స్వల్ప మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా టిడిపి హై కమాండ్ నుంచి ఫోన్లు రావడంతో కొన్ని నియోజకవర్గాలలో ఫలితాలు మారిపోయాయని వార్తలు కూడా ఇప్పుడు జనంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. కానీ టిడిపి నేతలు మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ అరాచకాలు వైసీపీ పార్టీ నేతలు మీద వ్యతిరేకత ఉండడం వల్లే టీడీపీకి పట్టం కట్టారని తెలియజేస్తున్నారు. కానీ వైసీపీ పార్టీకి తగిలిన షాక్కుకి ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉన్నది.

ముఖ్యంగా వైసీపీకి కంచుకోట అయిన కడప జిల్లాలో 10 సీట్లకు టిడిపి 6 సీట్లు కైవసం చేసుకోవడం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. అయితే ఇక్కడ టిడిపి నేతలు కేవలం తక్కువ మెజారిటీతోని గెలుపొందారు. అంతేకాకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేటింగ్ చేశారనె వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటి పైన కూడా పలు రకాల అనుమానాలు మొదలవుతున్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి ఓటమిపైన అలాగే మడకశిరలోని ఈరలకప్ప ఓటమి పైన కూడా  పలు రకాల అనుమానాలు మొదలవుతూనే ఉన్నాయి. టిడిపి పార్టీ కూటమిలో భాగంగా 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది.. ఈ విజయానందంలో టిడిపి శ్రేణులు జనసేన శ్రేణులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: