ఏపీ : ఎన్నికల వేళ.. చంద్రబాబుకు వాళ్ల ఉసురు తగులుతుందా?

praveen
ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేడెక్కిన ఆంధ్ర రాజకీయాల్లో ఇక ఇప్పుడు పెన్షన్ల వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఏకంగా గ్రామ వాలంటీర్లు పెన్షన్లు పంచుతున్నారని.. అదే సమయంలో వాలంటీర్లు అందరూ కూడా వైసిపి కార్యకర్తలుగా మారిపోయి పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ టిడిపి ఆరోపణలు చేసింది. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల  జోక్యం ఉండవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది.

 అయితే టిడిపి చేసిన ఈ పనిని అటు వైసిపి తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఏకంగా వృద్ధులను ఇబ్బంది పెట్టేందుకే టిడిపి ఇలా వాలంటీర్లు పెన్షన్లు పంచకుండా ఆపేందుకు ప్రయత్నించిందని వైసిపి ఆరోపిస్తుంది. ఇంకోవైపు తాము ప్రభుత్వ పథకాలను ఆపాలని చెప్పలేదని.. వాలంటీర్ల జోక్యం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని మాత్రమే చెప్పాము అంటూ టిడిపి కూటమి చెబుతోంది. ఇక ఇదే విషయంపై ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి.

 కాగా ఇదే విషయం గురించి అటు మాజీ మంత్రి, వైసిపి కీలక నేత మంత్రి పేర్ని నాని స్పందించాడు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దని.. ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ టిడిపి సానుభూతిపరుడు కాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించాడు మంత్రి పేర్ని నాని. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో ఇప్పుడు చంద్రబాబు మాట మార్చాడు అంటూ విమర్శించాడు. వృద్ధులు వితంతువుల ఉసురు పోసుకొని చంద్రబాబు బాగుపడతాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్రను విషపు కూటమి చేస్తుంది అంటూ ఆరోపించాడు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే ఇలా పెన్షన్ల కంపెనీలో వాలంటీర్ల జోక్యం లేకుండా చేయటంలో సక్సెస్ అయిన చంద్రబాబుకు ఇది కలిసి వస్తుందా మైనస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: