టిఆర్ఎస్ : మొన్న కేసీఆర్ కు.. ఇప్పుడు కేటీఆర్ కు.. రేవంత్ భలే షాక్ ఇచ్చాడుగా?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురై కేవలం ప్రతిపక్ష హోదాతో మాత్రమే సరిపెట్టుకున్న బిఆర్ఎస్ పార్టీకి అధికార కాంగ్రెస్ వరుసగా షాక్ లు ఇస్తూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి తమ పార్టీలో చేర్చుకున్నారో.. ఇక ఇప్పుడు రేవంత్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు.

 ఇప్పటికే బీఆర్ఎస్ లోని కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్ లోకి ఆకర్షితులను చేయడం లో సక్సెస్ అయ్యాడు రేవంత్ రెడ్డి. ఇక ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా అటు గులాబీ దళపతి కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న నేతలు సైతం కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒక రకం గా బిఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది అని చెప్పాలి. అయితే మొన్నటికీ మొన్న కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడైన కేకే కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో కెసిఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పుడు కేటీఆర్ కి కూడా ఇలాంటి షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది.

 మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ప్రధాన అనుచరుడుగా ఉన్న అలిశెట్టి అరవింద్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. తన రాజకీయ గురువుగా భావించే కేకే సైతం బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో అడుగు పెట్టడం తో ఇక అరవింద్ కూడా గురువు వెంట వెళ్లాలని అనుకుంటున్నాడట. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కు సన్నిహితుడుగా ఉంటూ ప్రధాన అనుచరుడుగా కొనసాగిన అలిశెట్టి అరవింద్.. ప్రస్తుతం రాష్ట్రం లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో హస్తం గూటికి చేరడానికి నిర్ణయించుకున్నాడు అని సమాచారం. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: