రాయలసీమ: బాలకృష్ణ వల్లే టిక్కెట్టు పోగొట్టుకున్న స్వామీజీ.. కట్ చేస్తే..!

Divya
పరిపూర్ణానంద స్వామి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పూజలలో కంటే ఎక్కువగా రాజకీయాలలోనే పేరుపొందుతున్నారు. ముఖ్యంగా గతంలో తెలంగాణ ఎన్నికలలో ప్రయత్నించిన పెద్దగా వర్కౌట్ కాలేదు... అందుకే ఈసారి ఏపీలో తన దృష్టిని పెట్టినట్టుగా తెలుస్తోంది.. ఇండియన్ హెరాల్డ్ అందిస్తోన్న సమాచారం ప్రకారం.. తెలంగాణలో బిజెపి సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా చేసుకున్నారు.. ఈయన కాని ఆంధ్రలో మాత్రం హిందూపురం ఎంపీ అభ్యర్థి దగ్గరే ఉండిపోయారు.. అయితే బిజెపి నుంచి ఎంపీసీటు కూడా ఇప్పుడు దక్కడం లేదు. దీంతో చివరిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు.

ఇండియన్ హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. బిజెపి సీటు వస్తుందని భావించిన పరిపూర్ణానంద స్వామి ఆరు నెలలకు ముందే హిందూపూర్ లో క్యాంపు ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపట్టారు.. తనకు టికెట్ రాకపోయినా కూడా కచ్చితంగా బరిలోనే ఉంటానంటూ తెలియజేశారు. అంతేకాకుండా తనకు టికెట్ రాకపోవడానికి బాలకృష్ణనే కారణమంటూ ఇటీవలే ఆరోపించినట్టుగా సమాచారం.. బిజెపి కూటమిలో భాగం కాకముందే పరిపూర్ణానంద స్వామి తాను హిందూపూర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని బిజెపి అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం హిందూపూర్ అసెంబ్లీ అభ్యర్థిగా టిడిపి నుంచి బాలకృష్ణ పోటీ చేస్తూ ఉండడంతో ఆ ఒత్తిడి వల్లే తనకు పార్లమెంట్ సిట్ల విషయంలో అవకాశం ఇవ్వకుండా చేశారని పరిపూర్ణానంద స్వామి తెలిపారు.. హిందూపురంలో ముస్లింల ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయి.. ఈ సమయంలో బిజెపి పార్టీకి సీటు ఇస్తే ఖచ్చితంగా ఆ ఓట్లు టిడిపికి పడవని గెలుపు కష్టమవుతుందని బాలకృష్ణ భావించడంతో ఈ టికెట్ బిజెపికి ఇవ్వకుండా తానే తీసుకున్నట్లు సమాచారం. అయితే పరిపూర్ణానంద స్వామి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు.. ఇండియన్ హెరాల్డ్ అందిస్తోన్న ప్రత్యేక కథనం ప్రకారం.. ఈ విషయంపై టిడిపి  పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా నిలబడితే ఓట్లు చీలి బాలయ్యకు దెబ్బ పడుతుందా అనే విషయం అటు టిడిపి కార్యకర్తలలో అభిమానులు కూడా సందేహాలు మొదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: