పవన్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. ముసిలోడంటు..!!

Divya
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న ఈయన చిరంజీవిలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని కూడా అమ్మేసుకున్నారని తమ్ముడు కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసి వేల కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. పవన్ తనకు ఉన్న సీటు ఇచ్చిన కూడా చాలనుకుంటాడనీ ..నాదెండ్ల మనోహర్ కు సీటు లేదన్న కూడా ఓకే అంటారేమో అంటూ సెటైర్లు వేశారు.. 175 స్థానాల పోటీ చేయమని హరి రామ జోగయ్య చెప్పిన పవన్ ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోయారంటూ విమర్శించారు..

మరొకవైపు పవన్ కళ్యాణ్ ముసలోడు అయిపోయాడు అని ఇక సినిమాలకు పనికిరారని కె ఏ పాల్ దారుణంగా కామెంట్స్ చేశారు.. ఎన్నికలు ఏప్రిల్ లో నిర్వహించి మే లో ఫలితాలు వస్తాయి దాని వలన ఈవీఎంలు మిస్ అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ఇంత టైం ఎలక్షన్స్ నిర్వహించడానికి సమయం తీసుకోవద్దని ఎన్నికల అధికారులను కలిశానంటూ వెల్లడించారు కేఏ పాల్.. ఆంధ్రకు ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలంటూ కోరారట.

విశాఖ నుంచి కేఏ పాల్ ఎంపీగా పోటీ చేస్తుండగా వరంగల నుంచి బాబు మోహన్ పోటీ చేస్తున్నారంటే వెల్లడించారు.. ప్రెజర్ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మరొకవైపు వైఎస్ షర్మిల తన పార్టీల కోసమే తన అన్నతో గొడవ పడుతోందని తెలంగాణలో కాంగ్రెస్ను తిట్టి మరల 500 కోట్లకు కాంగ్రెస్లో తన పార్టీని కలిపేసిందంటూ ఆరోపించారు.. ఇదే చివరి ఎన్నికలు మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చిందంటే చట్టాలన్నీ పూర్తిగా మారిపోతాయని ప్రజలు అన్నిటిని ఆలోచించే ఓటు వేయాలంటూ కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలియజేశారు. ఏదిఏమైనా కేఏ పాల్ చేసిన ఈ కామెంట్స్ అటు పవన్ కళ్యాణ్ అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: