ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో త్రివిక్రమ్ లేడీ ఓరియంటెడ్ సినిమా.. వర్కౌట్ అయ్యేనా..!?

Anilkumar
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన లాజిక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు ఈ స్టార్ డైరెక్టర్. మొదట రైటర్ గా  తన ప్రతిభను చాటుకున్న శ్రీనివాస్ త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అలా దర్శకుడిగా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఆయన. ఇక ఇటీవల ఆయన మహేష్ బాబు తో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా ఊహించిన స్థాయిలో విషయాన్ని అందుకోలేదు. దాంతో ప్రస్తుతం తను నెక్స్ట్ చేయబోయే సినిమాతో అయినా ఎలాగైనా హెట్టు కొట్టాలి అనీ భావిస్తున్నాడు. ఇక గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత ఆయన మరొక సినిమా అనౌన్స్ చేయలేదు. ఇదివరకే అల్లు

 అర్జున్తో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటికీ దానిపై పూర్తి క్లారిటీ లేదు. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఆయన హీరోలతో మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్లతో కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ కథతో ఒక సినిమాని రెడీ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇక ఈ సినిమా పురాణ కథలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నట్లుగా వినికిడి. అయితే ఈ వార్త విన్న తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక ఆ ఇద్దరు హీరోలు ఎవరు అన్న విషయంపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న

 సమాచారం ప్రకారం ఇందులో ఒకరు సంయుక్త మీనన్ అని అంటున్నారు. కానీ ఆ రెండవ హీరోయిన్ ఎవరు అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం దానిపై సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. మొత్తానికి అయితే ఎప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు స్టార్ హీరోయిన్లతో లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేయడానికి కూడా రెడీ అయ్యాడు.  ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేస్తే హీరోల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతోనే త్రివిక్రమ్ హీరోయిన్స్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ విషయంపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: