పవన్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సాయి తేజ్.. ధర తెలిస్తే మతిపోతుంది..!?

Anilkumar
మెగా కుటుంబం ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఇందులో భాగంగానే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి లభించింది. అలాగే కూటమిలో భాగంగా జనసేన పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ అభ్యర్థులు అందరూ కూడా భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపుగా పదేళ్ల కష్టానికి ఫలితంగా ఇప్పుడు జనసేన పార్టీ గెలుపు సొంతం చేసుకుంది. దీంతో మెగా కుటుంబం అందరూ పండగ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి

 పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కి బహుమతులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సాయి ధరం తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా  తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అందించిన గిఫ్ట్ ఏంటా అని అందరూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన తన మామయ్యకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అన్న విషయానికి వస్తే.. స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్ అంటూ ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్  సోషల్ మీడియా

 వేదికగా ఒక క్యాప్షన్ పెట్టాడు. ఆయనతో దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ దాని కింద పలు ఎమోషనల్ కామెంట్స్ సైతం పెట్టాడు. అదేంటంటే...   స్టార్ వార్స్, లెగో ను పరిచయం చేసిన వ్యక్తి, నా ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎంకి బహుమతి ఇచ్చే అవకాశం లభించింది. నా చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని చిన్నపిల్లాడి కోసం ఈ గిఫ్ట్ ఇస్తున్నాను… అని సాయి ధరమ్ తేజ్ రాసుకొచ్చాడు. చిన్న పిల్లలకు ఇచ్చే గిఫ్ట్ ఇచ్చి సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకత చాటుకున్నాడు.  ఇందులో భాగంగానే ఇప్పుడు సాయి తేజ్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఆ బహుమతి కాస్ట్ ఎంత అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం మొదలుపెట్టారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ బహుమతి విలువ దాదాపుగా ఒకటి. రెండు లక్షల కి పైగానే ఉంటుంది అని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: