జనసేన పార్టీ నుంచి టాప్ లీడర్లు జంప్..!!

Divya
జనసేన పార్టీ కి ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల పైన చాలా ఆశపెట్టుకుంది.. దీనివల్ల జనసేన పార్టీకి చాలా తిప్పలు ఎదురవుతున్నాయి. కీలకమైన గోదావరి జిల్లాలో ముఖ్యమైన నాయకులు సైతం జనసేన పార్టీ నుంచి వీడి బయటికి వెళ్లిపోతున్నారు.. పొత్తులను తప్పు పట్టడం లేదు కానీ ఈ పోత్తులలో భాగంగా తమకు సీట్లు రాకపోవడం తో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకు ప్రయత్నంగా ఏదైనా పదవులు ఇస్తారా అంటే ఈ విషయం పైన కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదట.దీంతో ముందు మీరు పని చేయండి ఆ తర్వాత చూస్తాం చెబుతామని చెప్పడంతో చాలామంది వీరిని నమ్మలేదు..

దీంతో నాయకులు ఒక్కొక్కరుగా జనసేన పార్టీని వీడి బయటికి వస్తున్నారు.. అచంట టికెట్ ఆశించగా.. చేగొండి సూర్యప్రకాష్  టికెట్ ఇవ్వడంతో.. ఆ మరుసటి రోజు వైసీపీలోకి చేరారు. దీంతో చాలామంది నేతలు తమను తాము సేఫ్ చేసుకోవాలనుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. తనుకు టికెట్ ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ రామచంద్రరావుతో బాగానే ఖర్చు పెట్టించిన ఈ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన చాలా దిగులుతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇలాంటి నేతలను పిలిచి మాట్లాడకపోవడంతో చాలామంది నేతలు సైతం జనసేన పార్టీ పై కోపంగానే ఉంటున్నారు.

కాపు నేతలను కూడా పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడకు లేకపోవడంతో పాటు ఫోన్ కూడా చేయకపోవడంతో చాలామంది విసుక్కుపోయారు. అలా కాపుల నుంచి వస్తున్న వతిల్ల వల్ల, భవిష్యత్తు రాజకీయం పైన చాలా గందర ఘోలం నెలకొంటుంది. దీంతో జనసేనలో ఉండలేక చాలా మంది నేతలు బయటికి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య వంటి వారిని కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు.. ఇక విరే కాకుండా రాబోయే రోజుల్లో  చాలా మంది నేతలు కూడా జనసేన పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: