షాక్: బిజెపిలోకి జనసేన పార్టీ విలీనం.. ఏం జరిగిందంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది.. ముఖ్యంగా రాష్ట్రంలో బిజెపి జనసేన టిడిపి ఈసారి కలిసి ఎన్నికలలో పోటీగా నిలవనున్నాయి.. కేవలం వైసీపీ పార్టీని ఒంటరిగా పోటీ చేయబోతోంది.. బిజెపి టిడిపి పొత్తు కుదరచడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్రను పోషించారు.. అయితే ఈ పొత్తులో భాగంగా వెనుక భారీగానే వ్యూహాలు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ రాబోయే ఎన్నికలలో ఈ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోవాలని ఆలోచనలు బిజెపి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే పవన్ కళ్యాణ్ ను ఎంపీగా పోటీ చేయాలని బిజెపి అగ్రనేతలు కూడా ఆయనకు సూచించారట. వారి యొక్క ఆదేశాల మేరకే పవన్ కళ్యాణ్ కాకినాడ లేదా అనకాపల్లి నుంచి ఏదో ఒకచోటలో నిలబడబోతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.. ఇప్పటివరకు సర్వేలు తెలుపుతున్న ప్రకారం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని అందుకే వారు కూడా చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపిక గెలిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఎన్నికల తర్వాత బిజెపిలోకి జనసేన పార్టీని పూర్తిగా విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. తెలంగాణలో ఏ విధంగా అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బాధ్యతలను సైతం తీసుకున్నారు ఆ వివాహాన్ని ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.. ఇందులో భాగంగానే టిడిపి బిజెపి జనసేన పొత్తుకరారు చేసుకున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి.. ఎన్నికల తర్వాత మరి ఏం జరుగుతుంది పరిస్థితులు ఎలా ఉంటాయని తెలియాలి అంటే మరొక కొన్ని రోజులు ఆగాల్సిందే.. మరి బిజెపిలోకి జనసేన పార్టీ విలీనం చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: