ఏపీ హైకోర్టులో జగన్‌కు అనుకూల తీర్పు?

Chakravarthi Kalyan
కోర్టు తీర్పులు అంటే జగన్ కు వ్యతిరేకంగానే వస్తాయని అందరూ భావిస్తుంటారు. సీఎం జగన్ కు, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చినవి వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. తాజాగా ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ ను దెబ్బకొట్టేందుకు దాఖలు చేసిన ప్రయా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు పొడిగించింది.

రాష్ట్రంలో జారీ చేసే కుల, జనన ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో నవరత్నాల లోగో  ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫోటో, లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా అవుతాయని కూడా ప్రశ్నించింది. సీఎం ఫొటో ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటని నిలదీసింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ కూడా రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అని వ్యాఖ్యానించింది.

ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది.  తదుపరి విచారణనను ఎనిమిది వారాలు వాయిదా వేసింది.  ఈ మేరకు  ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  అంటే అప్పటి లోగా ప్రభుత్వం మారిపోవచ్చు.. లేక తిరిగి ఇదే ప్రభుత్వం ఎన్నికవచ్చు.

అసలు విషయం ఏంటంటే.. ఎస్సీ, ఎస్టీల కుల, స్థానికత, జనన ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్, నవరత్నాల లోగో ముద్రించడాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించి.. వాటిని ముద్రించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించి.. వీటిని పరిశీలించాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు అసలు దీని పిటిషనర్ ఎవరు అని ఆరా తీసింది. ఆయన ఎస్సీ, ఎస్టీ సంఘం అధ్యక్షుడని రవి ప్రసాద్ తెలిపారు. ఎన్నికల సమయంలో లోగో, సీఎం ఫొటోల వల్ల ఎలా ప్రభావితం అవుతారని ప్రశ్నించిన హైకోర్టు.. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఈ తరహా వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజనాలే అవుతాయని ఘాటుగా వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: