మొదటి మహిళా దినోత్సవం.. మార్చి 8న జరగలేదట తెలుసా?

praveen
ఈ సృష్టికి మూలం ఒక మహిళ.. మనిషి చరిత్రకు మొదలు ఆ మహిలే. ఎంతటి చరిత్ర సృష్టించిన మొనగాడైన ఆ మహిళ కడుపులో పెరిగి పెద్దయి ఈ భూమ్మికి వచ్చినవాడే. ఎంతటి మహానుభావుడైన ఒక స్త్రీకి కొడుకే. ఇక ప్రతి మనిషి జీవితంలో ఎంతమంది కొడుకులు ఉన్నా కూతురు చూపించే ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. ఇలా మగాడి జీవితంలో మహిళ పాత్ర ఎన్నో రకాలుగా ఉంది. తల్లిగా, భార్యగా, అక్కగా,  చెల్లిగా కూతురిగా, మనవరాలిగా.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళ పాత్ర లేని మగవాడి జీవితం లేనేలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 అందుకే ఇలా మగాడిని ఈ భూమి మీదకి తీసుకువచ్చి ఇక ప్రతి అడుగులో కూడా తోడునీడగా ఉంటున్న మహిళ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసలు మహిళ అనేవారు లేకపోతే ఈ సృష్టి ఉండేది కాదు అన్నది కూడా అంతే అక్షర సత్యం అని చెప్పాలి. ఇలా ప్రతి మహిళ తల్లిగా జన్మనిస్తుంది. చెల్లిగా తోడునీడగా నిలుస్తుంది.. భార్యగా సుఖాలను అందిస్తుంది. ఇక కూతురుగా వర్ణించలేని ప్రేమను అందిస్తుంది. ఇలా మగాడి జీవితంలోని ప్రతి దశ కూడా ఒక మహిళతోనే ముడి పడింది  అయితే నేడు ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. ఇక మనిషి జీవితంలో మహిళ పాత్రను మరోసారి ప్రపంచం గుర్తు చూసుకుంటుంది.

 ఆర్థిక సామాజిక రంగాలలో  మహిళలు సాధించిన ఎన్నో ఘనతలను  ప్రపంచం మొత్తం మరోసారి నెమరు  వేసుకుంటుంది. ఈ క్రమంలోనె ఎక్కడ చూసినా ప్రస్తుతం మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మొదటి మహిళా దినోత్సవం ఎప్పుడు జరిగింది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు   అయితే మార్చ్ ఎనిమిదవ తేదీన ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. కానీ తొలి మహిళా దినోత్సవం మాత్రం ఫిబ్రవరి 28వ తేదీన జరిగిందట. 1909లో ఇలా మొదటి మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నారట. 1908లో గార్మెంట్ ఫ్యాక్టరీలో పరిస్థితులపై అక్కడి మహిళా వర్కర్లు గలమెత్తరట. ఇందుకు గుర్తుగా యూఎస్ లో మహిళా దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత 1910 లో క్లారా జెడ్ కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిపాదించారు. ఇక ఆ తర్వాత కాలంలో ఇక మార్చ్ 8 రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: