అన్నదాతలను ఆదుకున్న సీఎం జగన్?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో గతేడాది తవ్ర వర్షాభావంతో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అదే సమయంలో మిచౌంగ్ తుపాన్ తో అకాల వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కరవు, తుపాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు కష్టాలతో సతమతం అవుతున్న వారికి ఊరట కలిగించింది.  అన్నదాతల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులను సీఎం జగన్ జమ చేశారు. కరవు, తుపాన్ వల్ల నష్టపోయిన 11.59లక్షల మంది రైతులకు రూ.1294 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేశారు.

రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదల అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతలకు సరైన సమయంలో సహాయం అందిస్తున్నామని వివరించారు. రైతు నష్టపోకూడదు అనిదే మా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఏ పంట నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా పరిహారం అందజేస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు నాయుడి హయాంలో కేవలం 30లక్షల 85 వేల మందికి రూ.3415 కోట్లు ఇచ్చిన పరిస్థితి నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. గతంలో రంగు బారిన ధాన్యాన్ని కొంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదు.  దీని ద్వారా 54 లక్షల మందికి రూ.7812 కోట్లు నిధులు జమ చేశామని వివరించారు.  గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఈ 58 నెలల కాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

రైతులకు రూ.13500 పెట్టుబడి సాయం అందిస్తున్నాం.  అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయి. గతేడాది ఖరీఫ్ లో కరవు వల్ల నష్టపోయిన 6.94 లక్షల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.847 కోట్లు కాగా.. డిసెంబరు లో మిచౌంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు రూ.442 కోట్లు ఇస్తున్నామని సీఎం జగన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: