ప్లీజ్ అలా చేయకండి.. ప్రజా పాలన దరఖాస్తులపై కేటీఆర్ కామెంట్స్ వైరల్?

praveen
ఆరు గ్యారెంటీలు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది అన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో ఇక ఇచ్చిన మిగతా ఐదు హామీలను కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

 ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా అభయహస్తం పేరుతో ఇటీవల ప్రజా పాలన దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ దరఖాస్తుల ద్వారా అసలైన అర్హులు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే పథకాలకు దరఖాస్తులు ఇచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఏకంగా ఒక వ్యక్తి ఫ్లైఓవర్ పై వెళ్తుండగా.. ఇలా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు అన్ని కూడా ఏకంగా ఫ్లై ఓవర్ పై ఎగిరి పడటం చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. అంతేకాదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ దరఖాస్తులు కనిపిస్తూ ఉండడం ఆందోళనకరంగా మారింది. ఇదే విషయం గురించి అటు మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ప్రజాపాలన అప్లికేషన్లను ప్రైవేటు వ్యక్తులు నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేస్తున్న ఎన్నో సంఘటనలను వీడియోలను సోషల్ మీడియాలో చూస్తున్నాను. అనేకమంది నుంచి కూడా నాకు సమాచారం అందుతుంది. అయితే ఈ దరఖాస్తుల్లో కోట్లాదిమంది తెలంగాణ పౌరులు తమ వ్యక్తిగత ఆర్థికపరమైన వివరాలను కూడా పేర్కొన్నారు. ఈ రహస్య డేట సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎవరూ మీకు పింఛన్ ఇల్లు లేదా ఆరు గ్యారెంటీలలో దేనినైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటిపిగాని బ్యాంకు వివరాలను గానీ షేర్ చేయవద్దు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు అంటూ కేటీఆర్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: