గోదావరి : పవన్ను భయపెడుతున్నారా ?

Vijaya



కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తాజాగా చేసిన సూచన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను భయపెట్టేదిగానే ఉంది. పవన్ను ఉద్దేశించి జోగయ్య రాసిన లేఖ చదివిన వాళ్ళల్లో చాలామందికి ఇలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో పవన్ ఎక్కడినుండి పోటీచేస్తే గెలుస్తారనే విషయంలో జోగయ్య మూడు నియోజకవర్గాలను సూచించారు. అవేమిటంటే భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం.





జోగయ్య ఈ మూడు నియోజకవర్గాలనే ఎందుకు సూచించినట్లు ? ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లోని ఓట్లలో అత్యధికం  కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టే అనటంలో సందేహంలేదు. విచిత్రం ఏమిటంటే జోగయ్య సూచించిన మూడు నియోజకవర్గాలు పశ్చిమగోదావరి జిల్లాల్లోనివే. పవన్ గనుక తూర్పుగోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గంలో పోటీచేసినా గెలుపు అనుమానమే అని జోగయ్య అనుకుంటున్నారా ? అనే అనుమానం పెరిగిపోతోంది.





పొరబాటున కూడా తూర్పుగోదావరి జిల్లాలో పోటీచేయద్దని పవన్ కు హెచ్చరించటంలాగే అనిపిస్తోంది. కారణం ఏమిటంటే పవన్ వారాహియాత్ర కారణంగా కాపునేతల్లో పశ్చిమగోదావరి కాపులు, తూర్పుగోదావరి కాపులుగా చీలికవచ్చేసిందనే ప్రచారం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని కాపునేతల్లో ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు ఎక్కువమంది మద్దతుగా నిలుస్తున్నారు. యాత్రలో పవన్ అనవసరంగా ముద్రగడపై అవినీతి ఆరోపణలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనపై పవన్ అవినీతి ఆరోపణలు చేయటంతోనే ముద్రగ ఘాటుగా రియాక్టయ్యారు. దాంతో కాపుల గోలంతా ఇపుడు ముద్రగడ కేంద్రంగా నడుస్తోంది.





ఈ నేపధ్యంలో తూర్పులో ఏ నియోజకవర్గం నుండి పోటీచేసినా పవన్ను కాపులే ఓడగొడతారేమో అనే అనుమానం జోగయ్యలో ఉందేమో. అందుకనే పైగా పవన్ ఎక్కడ పోటీచేసినా గెలుపోటములతో సంబంధంలేకుండా ముద్రగడ కూడా నామినేషన్ వేస్తే మరింత గందరగోళం పెరిగిపోవటం ఖాయం. అదే పశ్చిమగోదావరిలో అయితే ముద్రగడ పోటీచేసే  అవకాశాలు దాదాపు లేవు. అందుకనే పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరంతో పాటు మరో రెండింటిని జోగయ్య సూచిస్తున్నారు. మొత్తానికి తూర్పులో పోటీచేయద్దని పవన్ను జోగయ్య భయపెడుతున్నట్లే అనిపిస్తోంది. మరి ఇంతకాలం పవన్ పోటీచేస్తారని ప్రచారంలో ఉన్న పిఠాపురం ఏమైపోవాలి ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: