భీజింగ్ : చైనా ప్రభుత్వానికి యూత్ షాక్

Vijaya



డ్రాగన్ దేశంలో యువత ప్రభుత్వానికి పెద్ద షాకిస్తోంది. తాము పెళ్ళిళ్ళు చేసుకోవటానికి దూరమని కాబట్టి పిల్లల్ని కూడా కనేదిలేదని ప్రభుత్వానికి తెగేసిచెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్నికనండని గోలపెడుతుంటే యువతేమో పెళ్ళిళ్ళకు, పిల్లలకు ఒక దణ్ణం అంటు మొండికేస్తున్నారు. ఇపుడు సమస్య ఏమిటంటే కరోనా వైరస్ తర్వాత చైనాలో జీవనవ్యయం బాగా పెరిగిపోయిందట. దీంతో మధ్య కాదు చివరకు ఎగువమధ్య తరగతి జనాలు కూడా నెలఖర్చులకు నానా అవస్తలు పడుతున్నారు.



తాము బతకటానికే ఇన్ని అవస్తలు పడుతుంటే ఇక పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలను ఎలా పోషించగలమని యువకులు గోల పెడుతున్నారట. భార్యను పోషించటమే కష్టమని అనుకుంటే మళ్ళీ పిల్లల్ను కూడా కనాలా అని ప్రభుత్వానికి ఎదురుతిరుగుతున్నారట. ఒకపుడు 1960, 70ల్లో ప్రభుత్వం పాటించిన కఠిన ఫ్యామిలి ప్లానింగే ఇపుడు రివర్సు కొడుతోంది. ఎలాగంటే ఇపుడు దేశంలో యువత శాతం తగ్గిపోయి ముసలివాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయిందట.



అప్పట్లో కుటంబానికి కేవలం ఒకళ్ళే సంతానం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం కచ్చితంగా పాటించింది. దాని ప్రభావం ముప్పై ఏళ్ళ తర్వాత కనబడిందట. ఈమధ్యలోనే అసలు పెళ్ళిళ్ళంటేనే యూత్ లో మొహం మొత్తిందట. ఒకవైపు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోవటం, మరోవైపు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఒక సంతానానికి మాత్రమే పరిమితమవ్వటంతో దేశజనాభా బాగా తగ్గిపోతోంది. దేశపరిస్ధితులను గమనించిన ప్రభుత్వం వెంటనే వివాహాలు చేసుకోండి, పిల్లల్ని కనండని గోల మొదలుపెట్టింది. అయితే అందుకు జనాలు అంగీకరించలేదు.



వివాహాలు ఎలా చేయాలా ? గంపెడు పిల్లల్ని కనేట్లు ఎలాచేయాలా ? అన్నది డ్రాగన్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిపోయింది.  సరిగ్గా ఈ సమయంలోనే కరోనా మహామ్మారి మీదపడింది. దాంతో జీవనవ్యయం విపరీతంగా పెరిగిపోయింది. అంటే జనాల బతుకులు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.  ఇపుడు గనుక జనాలు వెంటనే మేల్కొని వివాహాలు చేసుకుని అయినా చేసుకోకుండానే అయినా పిల్లల్ని కనాల్సిందే అని ప్రభుత్వం బెదిరిస్తోంది. వివాహం కాని అమ్మాయిలు ఐవీఎఫ్ పద్దతిలో పిల్లల్ని కనేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారులు ప్రతిపాదించారట. వివాహాలు, పిల్లల్ని కనటంపై ప్రభుత్వం 20 ప్రముఖ నగరాల్లో పెద్ద క్యాంపెయిన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: