అమరావతి : ఎల్లోమీడియా అవస్తలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న చంద్రబాబునాయుడును జనాలు పట్టించుకుంటున్నారో లేదో తెలీదు. రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబు సభల్లో జనాలు పెద్దగా కనబడటంలేదు. ఈమధ్యనే టూర్ చేసిన గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం సభలే ఇందుకు ఉదాహరణ. అందుకని జగన్ ప్రభుత్వాన్ని+వైసీపీని గబ్బుపట్టించేందుకు ఎల్లోమీడియా జోరుపెంచినట్లుంది. ఇందులో భాగంగానే ‘టికెట్ మీది..ఖర్చు మాది’ అనే బ్యానర్ స్టోరీని అచ్చేసింది. ఈ స్టోరిని చదవితే అచ్చంగా నాలుగు గోడల మధ్య వండేసిన వంటకంగా అర్ధమైపోతోంది.
స్టోరీ బాటమ్ లైన్ ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతోంది. టీడీపీ నేతలకు ఆకర్ష్ వల విసురుతున్నా ఎవరు చిక్కటంలేదు. ఎన్నికల ఖర్చంతా తామే పెట్టుకుంటామని చెబుతున్నా తమ్ముళ్ళు వద్దపొమ్మని చీకొడుతున్నారు. ముణిగిపోయే పడవ వైసీపీలోకి తాము ఎందుకొస్తామని దూరంగా నెట్టేస్తున్నారు. తమపార్టీలో హ్యాపీగానే ఉన్నాం కాబట్టి వైసీపీలోకి రావాల్సిన అవసరం తమకు లేదు అని మొఖంమీదే చెప్పేస్తున్నారట. చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి అభ్యర్ధులే లేరట.
మొత్తం స్టోరీ అంతా ఎల్లోమీడియా ఇలాగే రాసుకొచ్చింది. విషయం ఏమిటంటే వైసీపీ నేతలు రంగంలోకి దిగితే బయటకు పొక్కి పార్టీ అల్లరైపోతుంది కాబట్టి ఐప్యాక్ తరపున కొందరు రంగంలోకి దిగారని ముందుజాగ్రత్తగా రాసేసింది. నిజానికి టీడీపీ నుండి నేతలను తీసుకోవాల్సిన అవసరం జగన్ కుందా ? అన్నది పెద్ద ప్రశ్న. చాలా నియోజకవర్గాల్లో పోటీకి వైసీపీకి గట్టి అభ్యర్ధులు లేరని రాయటమే పెద్ద జోక్.
ఉత్తరాంధ్రలోని గట్టి నేత, రాయలసీమకు చెందిన పవర్ ఫుల్ నేత, ఉభయగోదావరులకు చెందిన బలమైన నేత..ఎల్లోమీడియా స్టోరీ అంతా ఇలాగే నిండిపోయింది. నిజంగానే వైసీపీ తరపున ఎవరైనా తమ్ముళ్ళని అప్రోచ్ అయ్యుంటే వాళ్ళ పేర్లు రాయటానికి భయమెందుకు ? ఒక నేత, ఒక సీనియర్ నేత అని రాశారంటేనే స్టోరీ ఎంత బోగస్సో అర్ధమైపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే పోటీకి అన్నీచోట్లా గట్టి అభ్యర్ధులు లేనిది టీడీపీకే. మహానాడులో లోకేష్ ప్రకటించిన ప్రకారమే చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి బాగాలేదు. పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చంద్రబాబుకే లేదు. ఈ నేపధ్యంలోనే ఎల్లోమీడియా జగన్ పైన రకరకాలుగా బురదచల్లేందుకు నానా అవస్తలు పడుతోంది.