అమరావతి : ఈ వ్యూహమంతా మ్యాజిక్ విక్టరీ కోసమేనా ?

Vijaya






వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ విక్టరీ కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే టీడీపీ బలంగా ఉన్ననియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని లాగేసుకోవటం. తనహయాంలో చంద్రబాబునాయుడు వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇక్కడే కనబడుతోంది. వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకుని జనాల్లో చంద్రబాబు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.






అందుకనే జగన్ ఆపనిచేయటంలేదు. ఎంఎల్ఏలను వదిలేసి కేవలం ద్వితీయశ్రేణి నేతలపైన మాత్రమే గురిపెట్టారు. ఏపార్టీ తరపున అభ్యర్ధి గెలవాలన్నా సదరుపార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు చాలా కీలకమన్న విషయం తెలిసిందే. ఒక నియోజకవర్గంలో సగటున ఐదు మండలాలున్నాయని అనుకుందాం. ప్రతిమండలంలోను కనీసం ఇద్దరు గట్టినేతలు మనస్పూర్తిగా పనిచేస్తేనే అభ్యర్ధి గెలుపు సాధ్యమవుతుంది. అంటే ఒకఅభ్యర్ధి ఎంఎల్ఏగా గెలవాలంటే కనీసం పదిమంది గట్టినేతలు మద్దతు చాలా అవసరం.






ఇఫుడు జగన్ చేస్తున్నదేమంటే జగన్ టీడీపీలోని అలాంటి పదిమంది గట్టినేతలపైన దృష్టిపెట్టడమే. వీరిలో ఎంతమందిని వీలుంటే అంతమందిని వైసీపీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మ్యాజిక్ విక్టరీ సాధ్యమే అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని టీడీపీ ద్వితీయశ్రేణి నేతలపై ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారట. మంగళగిరిలో గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకోవటం తన వ్యూహంలో భాగమే అని వైసీపీ వర్గాలంటున్నాయి. చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలతో చర్చలు జరుగుతున్నాయట. ఆ చర్చలు ఒక కొలిక్కివస్తే డైరెక్టుగా జగనే సదరు నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.






మొత్తానికి జగన్ తన వ్యూహాన్ని చాపకిందనీరులాగ అమలుచేసుకుని వెళుతున్నారు. జగన్ వ్యూహంగనుక సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ రీచైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి జగన్ వ్యూహానికి చంద్రబాబునాయుడు ఏమివిరుగుడుమంత్రం వేస్తున్నారో తెలీటంలేదు. ఎందుకంటే పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జీలే లేరు. ఇప్పటికే మూడువర్గాలుగా నేతలు విడిపోయి గొడవలుపడుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో జగన్ వ్యూహం పనిచేస్తోంది. చంద్రబాబు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారంతే. మంగళగిరిలో గంజి చిరంజీవి పార్టీకి దూరమైంది ఇలాగే. మరి తొందరలోనే ఎంతమంది ఇలా టీడీపీకి దూరమవుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: