ఉక్రెయిన్- రష్యా యుద్ధం.. భారత్‌కు భారీదెబ్బ?

Chakravarthi Kalyan
రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మన ఇండియాపైనా భారీగానే ఉంటోంది. ఈ యుద్ధ ప్రభావం కారణంగా ఇండియాలో అనేక రంగాల్లో సంక్షోభం నెలకొంది. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. చివరకు వంట నూనెల రేట్లు కూడా పెరిగాయి. అయితే అక్కడితో ఆగలేదు. మన దేశ రక్షణ రంగంపైనా ఈ యుద్ధం ప్రభావం భారీగానే పడిందని రక్షణ రంగం వర్గాలు చెబుతున్నాయి.


ఎందుకంటే మన రక్షణ అవసరాలు చాలా వరకూ రష్యాతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే మనం రష్యాతో అంత దోస్తీగా ఉంటాం. అలాంటిది ఈ యుద్ధం కారణంగా భారత వైమానిక దళానికి రావాల్సిన యుద్ధ విమానాలు ఆగిపోయాయని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. రష్యా నుంచి ఇండియాకు 35వేల కోట్ల రూపాయల విలువ చేసే సుఖోయ్ -30 యుద్ధ విమానాలు రావాల్సి ఉంది. వీటని మనం ఆధునీకరణ కోసం పంపాం. అయితే.. ఈ యుద్ధం వల్ల ఈ ఆధునీకరణ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయినట్టేనని తెలుస్తోంది.


యుద్ధం వ్యవహారం ఒక కొలిక్కి వస్తే తప్ప మన పని పూర్తి చేసే అవకాశం రష్యా సైన్యానికి లేదని చెప్పొచ్చు. ఈ ప్రక్రియ యుద్ధం కారణంగా వాయిదా పడినట్లేనని మన అధికార వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు..  వీటితోపాటు 12 అత్యాధునిక విమానాల కోసం 20వేల కోట్లతో చేసుకున్న ఒప్పందం కూడా కొంత కాలం  ఆలస్యం కాక తప్పదని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.


మన వైమానికి దళానికి చెందిన 85 విమానాలను రష్యా ఆధునికీకరించాల్సి ఉంది. ఈ యుద్ధం కారణంగా ఆ పని వాయిదా పడినట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే మన వద్ద ఉన్న సుఖోయ్ -30 యుద్ధ విమానాలను శక్తిమంతమైన రాడార్లు, అధునాతన ఎలక్ట్రానిక్ సామర్థ్యాలతో తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. రష్యా నుంచి అందివచ్చే పరికరాలతో మన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ యుద్ధ విమానాలకు కొత్త సామర్థ్యాలు అందించనుంది. యుద్ధం కారణంగా ఈ విడిభాగాల సరఫరాలో ఆలస్యం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: