ఏపీలో రేషన్ సరుకులు ఆలస్యం... మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?

VAMSI
ప్రజల కోరిక మేరకు ఆంధ్ర రాష్ట్రంలో తాజాగా నూతన జిల్లాల ఏర్పాటు జరిగింది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఈ కొత్త జిల్లాలను అమలులోకి తీసుకొచ్చారు సిఎం జగన్. మొత్తం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు అయ్యాయి. అయితే ఈ నూతన జిల్లాల ఏర్పాటు కారణంగా కొద్ది రోజుల నుండి అధికారులు బాగా బిజీ అయ్యారు. దాంతో జరగాల్సిన కొన్ని పనులు ఆలస్యం అయ్యాయి. ఈ నేపథ్యం లో రేషన్ సైతం సమయానికి అందచేయలేకపోతున్నాము అంటూ సవినయంగా తెలియచేశారు సదరు అధికారులు. నూతన జిల్లాల ఏర్పాటు హడావిడి వలన కొన్ని పనులు కాస్త ఆలస్యం అయ్యాయి అంటూ తెలియచేశారు.

సాధారణంగా ప్రతి నెల 4 వ తేదీన రేషన్ సరుకులు అర్హులైన వారందరికీ ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా ప్రతి నెల జరుగుతూ వస్తోంది. అయితే ఈసారి ఈ నూతన జిల్లాల ఏర్పాటు కారణంగా రేషన్ సరుకులు పంపిణీ కాస్త ఆలస్యం అయ్యింది. ఈ నెల 4 నుండి మొదలవ్వాల్సిన రేషన్ పంపిణీ  ఈ నెల 8 వ తేదీ నుండి ఇస్తామని అంటున్నారు అధికారులు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సాంకేతికంగా స్టాక్ జనరేట్ చేయడం లో కొన్ని ఇబ్బందులు వచ్చాయని దాని కారణంగానే ఈ ఆలస్యం అని పేర్కొన్నారు. ఈ సమస్యలను మరో రెండు రోజుల్లో పరిష్కరించి 8 వ తేదీ నుండి రేషన్ పంపిణీ జరిగేలా చూస్తామని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెబుతున్నారు.

ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడుతూ ఎట్టకేలకు ఏపిలో నూతన జిల్లాల ఏర్పాటు జరగడం ఆనందించదగ్గ అంశం. జగన్ సర్కారు కొత్త జిల్లాల ఉద్దీపన మేరకు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు అయ్యాయి. కొత్తగా తిరుపతి, అనకాపల్లి, కోనసీమ, పార్వతీ పురం మన్యం, అల్లూరి, రాజమండ్రి,  విజయవాడ, నంద్యాల, సత్యసాయి,అన్నమయ్య, నరసాపురం, నర్సరావుపేట, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలు అమలులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: